సెప్టెంబర్‌ 2న తెలంగాణ రచయితల వేదిక

నిర్మల్‌ (ఆదిలాబాద్‌): సెప్టెంబర్‌2న నిర్మల్‌లో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్రధక్షుడు గౌరీశంకర్‌ తెలియజేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. రచయితల వేదిక 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారానే ప్రత్యేక  రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. ఈ సభలు ఆ ఉద్యమానికి దిశానిర్ధేశం చేస్తాయన్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం వల్లే రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. దీనితోపాటు తెలంగాణ సంస్కృతిని  దెబ్బ తీయడానికి పాలకలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా తిరుపతిలో నిర్వహించనున్న తెలుగు మహాసభలను బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో  వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పాల చక్రధారి, కార్యదర్శి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.