సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల లో ఘనంగా యువప్లేర్ ఉత్సవాలు.
కూకట్ పల్లి జనంసాక్షి :సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల లో సెప్టెంబరు 27న “”యువఫ్లేర్” అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించింది.ఒలంపిక్ పతక విజేత గగన్ నారంగ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాండ్రా హోర్టా ఫెస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ డా. సాండ్రా హోర్టా యువఫ్లేర్ను సృజనాత్మకంగా, అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. సమావేశాన్ని ఉద్దేశించి నారంగ్ మాట్లాడుతూ, మహిళలు ఎలా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవచ్చో మహిళలు ఎలా మల్టీ టాస్క్ చేసి విజయం సాధించవచ్చో సూచించారు. మొదటి సారి, కళాశాల స్వంత మస్కట్ లూనా, పరిచయం చేసింది. అనంతరం విద్యార్థులు పాటల పోటీ నుంచి కాస్ప్లే వరకు, బిజినెస్ క్విజ్ నుంచి నుక్కడ్ వరకు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలు మరియు పాల్గొనేవారికి సర్టిఫికేట్లు, బహుమతులు పంపిణీ ప్రధానం చేశారు.ప్రముఖ నర్తకి డాక్టర్ వైష్ణవి సాయినాథ్ కార్యక్రమంతో ఫెస్ట్ ముగిసింది.ఈ ఫెస్ట్‌ని ఎస్ ఎల్ జి జ్యువెలర్స్, టాటా ప్లే, అబ్సొల్యూట్ బార్బెక్యూస్, వాయు మీడియా, ఎస్ ఐ జి, ఐ బి ఎస్, ది లేబుల్, లుక్స్, డిజిటల్ నెస్ట్ జాంబోరీ స్పాన్సర్ చేశారు.