సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ వెంకటరెడ్డి
హుజూర్ నగర్, సెప్టెంబర్ 23 (జనం సాక్షి): సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలోని బాటసారులకు, వాహనదారులకు శుక్రవారం ఎస్ఐ వెంకటరెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని, మీకు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఓటిపిలు చెప్పమని, మీకు లక్కీ డ్రా కలిశాయని మభ్యపెడుతూ మీ అకౌంట్ లో ఉన్న డబ్బులను కాజేస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని, అనుమానం వచ్చినవారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.