సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు

ఢిల్లీ: సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. ఈరోజు సోనియాతో నరసింహన్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు. మరికాసేపట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో నరసింహన్‌ సమావేశం కానున్నారు.