‘హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యం’

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి):

సింగరేణి పరిరక్షణకు… కార్మికుల హక్కుల రక్షణకు పోరాటాలే శరణ్యమని… గోదావ రిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఇఫ్టూ) రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ అన్నారు. మంగళవారం ఇఫ్టూ కార్యాలయంలో ఆర్జీ-1 జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. కార్మికవర్గాన్ని మభ్యపెట్టే విధంగా ఓట్ల కోసం రకరకాల హామీలను గుప్పిస్తున్నారన్నారు. ఇఫ్టూను సింగరేణి ఎన్నికల్లో గెలిపించాలని… ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఇ.నరేష్‌. ఇ.రామకృష్ణ, బి.రాజనర్సు, కొమురయ్య, శంకర్‌లింగం, భీమయ్య, భోజరాజు, అయిలయ్య, సిహెచ్‌.మల్లారెడ్డి, మొగిలి, ఎస్‌.కె. మహబూబ్‌, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.