హరిగఢ్‌గా అలీఘడ్‌


యూపిలో పాతపేర్ల పునరుద్దరణ
లక్నో,ఆగస్ట్‌17(జనంసాక్షి):: యూపీలో యోగి ఆదిత్యానాధ్‌ సారధ్యంలోని పాలక బీజేపీ ప్రభుత్వం పట్టణాలకు పాత పేర్ను పునరుద్దరించే పనిలో పడిరది. గతంలో ఉన్న పేర్లకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈక్రమంలోనే పేర్ల మార్పు పక్రియ కొనసాగిస్తోంది. అలీఘఢ్‌ను హరిఘఢ్‌గా, మొయినాబాద్‌ జిల్లాను మయన్‌ నగర్‌గా పాత పేర్లను పునరుద్ధరించాలని రెండు జిల్లా పంచాయతీలు తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపాయి. ఇటీవల జరిగిన జడ్‌పీ ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు జడ్‌పీ పీఠాలను కైవసం చేసుకోవడంతో తొలి సమావేశంలోనే జిల్లాల పేర్లు మార్చుతూ తీర్మానాలను ఆమోదించాయి. బీజేపీ నేత భార్య విజయ్‌ సింగ్‌ అలీఘడ్‌ జడ్‌పీ చీఫ్‌గా ఎంపిక కావడంతో స్వామి హరిదాస్‌ పేరిట ఏర్పాటైన జిల్లాను హరిఘఢ్‌గా పునరుద్ధరించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించాయి. ఇక మొయిన్‌పురి జిల్లా పేరును మయన్‌ రిషి పేరిట లోగడ వ్యవహరించగా అదే పేరును పునరుద్ధరించాలని జడ్‌పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.