హస్తిన నుంచి హైదరాబాద్‌కు జానా తిరుగుటపా

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి): తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దంటూ ఈప్రాంత కాంగ్రెస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని ఢిల్లీ పెద్దలకు అందించేందుకు వెళ్ళిన సీనియర్‌ మంత్రి కె. జానారెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కట్టారు. ఈ ఉదయం కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశమైన శుక్రవారం జరిగిన టి-కాంగ్రెస్‌ నేతల సమావేశ వివరాలను ఆయనకు వివరించారు.  తాజా కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. నెల రోజుల్లో తెలంగాణకు పరిష్కారం చూపుతామన్న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఇప్పటికే రెండు దఫాలు సమావేశమై తెలంగాణపై చర్చించింది. తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? వాటి పరిణామాలు పార్టీపై ఏ ప్రభావం చూపుతాయనే దిశలో కాంగ్రెస్‌ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ పూర్వ రంగంలో సైనిక దళాధిపతి రాష్ట్ర పర్యటన చర్చనీయాంశమైంది.