హీరోయిన్ అంజలి పెళ్లి వార్తల్లో నిజమెంత?!

share on facebook

నెటిజనులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు తెగ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాని బాగా వేడెక్కిస్తున్నారు. ఆ పోస్టుల ద్వారా అందర్నీ ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఒకటా..రెండా ఎన్నో చోట్లా నచ్చిన పోస్టులను బాగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియాని వాడేస్తున్నారు.
ఇక అసలు విషయానికొద్దాం.. ‘సీతమ్మ’కు సినిమా కష్టాలు మళ్లీ మొదలయ్యాయట. ‘సీతమ్మ’ అంటే మీరు ఎవరో అనుకునేరు! అదేనండీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హీరోయిన్ అంజలి. ఇప్పుడు మనం మాట్లాడుకునున్నది కూడా ఆమె గురించే మరి! కథానాయిక అంజలికి పెళ్లైపోయిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా కబురు బాగా వైరల్ కూడా అవుతోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా హీరోయిన్ అంజలి పెళ్లైపోయిందంటూ గుసగుసలే వినిపిస్తున్నాయి.. పోస్టుల రూపంలో కనిపిస్తున్నాయి కూడా! సోషల్ మీడియాలో ఇప్పడేదైనా వైరల్ న్యూస్ అంటే ఇదే! లేటెస్ట్ వైరల్ న్యూస్ ఏముంటుందంటే.. ఇంకేం ఉంది.. హీరోయిన్ అంజలి పెళ్లి వార్తే. ఆమె అమెరికాకు చెందిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుందన్నది న్యూస్. మొదట్లో ఈ న్యూస్ ని తేలిగ్గా తీసుకున్న అంజలి ఎట్టకేలకు నోరువిప్పింది.. తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. అచ్చ తెలుగందం అయిన అంజలి ‘పింగ్ మాల్’ ద్వారా పరిచయం అయింది. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలతో జోడీ కట్టింది. నటిగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చిందని సినీ ప్రేమికులు కొనియాడారు. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో జరీనా పాత్రలో చక్కటి నటన ప్రదర్శించి అన్ని వర్గాలను,ముఖ్యంగా సినీ విమర్శకులను ఎంతగానో మెప్పించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ‘సీత’ పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కాసులవర్షం కురిపించింది. దాంతో అంజలికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత అంజలికి ‘గీతాంజలి’ చిత్రం విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మరోసారి ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ ఎందుకోగానీ.. క్రమంగా అంజలికి ఇటు తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఒక దశలో తమిళ్ హీరోతో అంజలికి ఎఫైర్ ఉందంటూ జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోలీవుడ్ హీరో జై తో అంజలి సీరియస్ రిలేషన్షిప్ నడిపారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ కలిసి ‘ఎంగయుమ్ ఎపోతుమ్’ అనే తమిళ చిత్రం చేశారు. తెలుగులో ‘జర్నీ’ టైటిల్ తో విడుదలైన ఈ రొమాంటిక్ ట్రాజిక్ లవ్ ఎంటర్టైనర్ రెండు భాషల్లో విజయం అందుకుంది. అయితే ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. ఇదిలా.. ఉండగా తాజాగా అంజలిపై మరో ఆసక్తికరమైన రూమర్ ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆమెకు పెళ్లైపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అంజలి ఓ అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన అంజలి క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా అంజలి… తన పెళ్లిపై వస్తున్న వార్తలకు సూటిగానే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆ వార్తల్లో ఈ మాత్రం నిజం లేదని.. తనకు పెళ్లి ఫిక్స్ అయితే ఖచ్చితంగా అందరికీ చెబుతానని, పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లానంటూ పుకార్లు పుట్టించారు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఆ రోజు వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతాను అంది. అంజలి ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారని సమాచారం!!

Other News

Comments are closed.