హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైద్రాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో హుక్కాసెంటర్లు, పబ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హుక్కా సెంటర్లు, పబ్‌లపై అనేక ఆరోపణలు వచ్చాయి. మన సంస్కృతికి విఘాతం కలిగించే విధంగా యువతులు కూడా పభలకు వెళ్లడం, హుక్కా సెంటర్ల యాజమాన్యాలు యువకులపై దౌర్జన్యాలకు దిగడంతో పోలీసులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకుంటున్నారు.