హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల పరిశీలన
18 నామినేషన్లు తిరస్కరణ
కరీంనగర్,అక్టోబర్11 (జనం సాక్షి)
హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. అయితే 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బరిలో 43 మంది అభ్యర్థులు నిలిచారు. 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి నియోజకవర్గంలో ఏమి జరుగుతున్నదనేది క్షణక్షణం తెలుసుకుంటున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసు శాఖ నిఘా పెట్టింది. 1900 మంది పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసింది. త్వరలో 120 సెక్షన్ల కేంద్ర బలగాలు రానున్నాయి.