హెలికాప్టర్‌ అత్యవసరంగా దించివేత

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో కాత్రాలో పవన్‌హంస్‌కు చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందికి దించివేశారు. పైలట్‌ అప్రమత్తమై సురక్షిత ప్రాంతంలో దించడంతో హెలికాప్టర్‌లోని ఆరుగురి ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.