హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ప్రదర్శన
ఖైరతాబాద్: ఆగస్టు 01 (జనం సాక్షి) ముంబై, ఢిల్లీ నగరాల్లో 20 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా తన పయనం సాగించిన బ్రైడల్ ఏషియా తొలిసారిగా నవాబుల నగరం హైదరాబాద్లో అడుగు పెడుతోంది. భారతీయ వివాహ రంగంలో మొట్ట మొదటి, చివరి పదమైన బ్రైడల్ ఏషియా దశాబ్దాలుగా భారత ఉపఖండంలో తన అసాధారణ స్థాయిని నిలుపుకోగలిగింది. సాటిలేని క్యూరేటెడ్ ఆఫరింగ్లకు ఇది పర్యాయపదం. పెళ్లిబట్టలు, భారీ ఆభరణాలు, హాట్ యాక్ససరీలు అన్నీ ఒకేచోట ఇక్కడ లభిస్తాయి. దివ్యగుర్వారా, ఆమె కుమారుడు దువ్ గుర్వారాల డైనమిక్ నాయకత్వంలో ఈ సరికొత్త ప్లాట్ఫాం తన అచంచల శక్తితో ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని వివాహ జ్ఞాపకాలను, ఉత్కృష్ట వివాహాలను సృష్టించింది. ఆయేషా రావు, అనుశ్రీ రెడ్డి, మృణాళిని రావు లాంటి భారతదేశపు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన హెరిటేజ్ జ్యువెలరీ బ్రాండ్లతో కూడిన కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రదర్శనలో ఉంచనున్నారు. అమారిస్ దీన్ని ప్రేరణా రాజాపాల్, అన్మోల్ జ్యువెలర్స్, బదాలియా జెమ్స్, కాంతిలాల్ సిన్స్ 1948, రేర్ హెరిటేజ్, రంభజోస్, పీసీ టోటుకా అండ్ సన్స్, పీఎంజీ జ్యూవెల్స్, శోభా శృంగార్ జ్యువెలర్స్ రూపొందించారు. విలాండి – దీన్ని శిఖర్జీ జ్యువెలర్స్ రూపొందిచారు. అవన్నీ ఫ్యాషన్ ప్రియుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెం.2 లో సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఈ ప్రదర్శన ఉంటుంది.