హైదరాబాద్‌లో నడిచి వెళితేనే తొందరగా వెళతాం

రోడ్లను పట్టించుకోని మంత్రి కెటిఆర్‌: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా తయారయ్యాయని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ తెలిపారు. అద్దంలాగా హైదరాబాద్‌ను చేస్తానన్న వారు కనీసం రోడ్లను కూడా బాగు చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు మాటలు తప్ప పనులు ఉండవని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వాహనాలపైన కాకుండా నడుచుకుంటూ పోతే తొందరగా వెళ్లొచ్చన్నారు. హైదరాబాద్‌లో ఏ రోడ్డుపైనైనా గంటకు 10 కిలోవిూటర్ల స్పీడ్‌తో వెళ్లగలమా? అని ప్రశ్నించారు. రోడ్లపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే మిషన్‌ భగీరథ పథకం బోగస్‌ అని చెప్పారు. పైపుల్లో 60 శాతం కమిషన్‌ వస్తుందని గుంతలు తవ్వి పైపులు వేశారన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులను గ్రామాల్లో తన్ని తరిమే రోజులు తొందరలోనే వస్తాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ చేతిలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా అయ్యిందని షబ్బీర్‌ అలీ అభివర్ణించారు.