హైదరాబాద్ లో జరిగే మాలమహానాడు సదస్సును విజయవంతం చేయండి
పెనుబల్లి, మార్చ్ 4(జనం సాక్షి)ఈనెల 25 న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మాల మహానాడు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతొట్టి కాంతయ్య పిలుపు నిచ్చారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి కోసం జరిగే మాల మహానాడు రాష్ట్ర సదస్సు పాంప్లెట్లను మండల పరిధిలోని వియ్యం బంజర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో అధిక శాతం ఉద్యోగ ఉపాది అవకాశాలు ఉన్న ప్రైవేటు రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమరు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకు మాల మహానాడు నిర్వహించే ప్రజాస్వామిక పోరాటాలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు,మద్దతు తెలపాలని అన్నారు, న్యాయమైన రాజ్యాంగ హక్కులను కాపాడుట కోసం అందరు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాదులో జరిగే మాల మహానాడు సదస్సు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంతయ్య పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్లగిరి కాంతారావు, గరికె వందనం, జొన్నలగడ్డ వెంకటేశ్వరావు, ఎం యేసు పాదం, నరసింహారావు, భుఖ్య లక్ష్మి, మాలోతు రాధా తదితరులు పాల్గొన్నారు.