హోబార్ట్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదం పీటర్‌ సిడిల్‌పై లంక ఆరోపణలు

¬బార్ట్‌,డిసెంబర్‌ 18:  ఆస్టేల్రియా , శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో బాల్‌టాంపరింగ్‌ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్‌ బౌలర్‌ పీటర్‌ సిడిల్‌ బాల్‌టాంపిరింగ్‌కు పాల్పడ్డాడంటూ శ్రీలంక సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై ఐసిసికి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ మూడోరోజు లంక తొలి ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో ప్రసన్న జయవర్థనేకు సిడిల్‌ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఇది చోటు చేసుకున్నట్టు లంక మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. తాము టీవీలో దీనిని చూసామని , సిడిల్‌ బంతి రూపును మార్చేందుకు తన వేలి గోళ్ళతో ప్రయత్నించాడని ఆ జట్టు మేనేజర్‌ చరిత్‌ సేనానాయకే చెప్పారు. అప్పుడే డ్రెస్సింగ్‌ రూమ్‌లో దీనిపై చర్చ జరిగిందని , అయితే వీడియో ఫుటేజ్‌ మరోసారి పరిశీలించగా తమ అనుమానం నిజమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ ఓవర్‌కు సంబంధించిన ఫుటేజ్‌ తమతోనే ఉందని వెల్లడించారు. దీనిపై మ్యాచ్‌ రిఫరీకి లంక మేనేజ్‌మెంట్‌ ఫిర్యాదు చేసింది. అయితే లంక క్రికెట్‌ బోర్డు రిఫరీతో పాటు ఐసిసికి కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇదే మ్యాచ్‌లో కరుణారతనే ఔటైనప్పుడు కూడా ఆసీస్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్టు లంక మేనేజ్‌మెంట్‌ ఆరోపిస్తోంది. 88వ ఓవర్‌ ఫుటేజ్‌లో తాము పరిశీలించినా… ఓపెనర్లు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా బాల్‌ టాంపరింగ్‌ జరిగిందని సేనానాయకే అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే లంక ఆరోపణలను ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు ఖండించింది. ప్రస్తుతం ఈ వివాదం లంక బోర్డు , ఐసిసికి సంబంధించినదని స్పష్టం చేసింది. ఐసిసి నిబంధనల ప్రకారం బంతి రూపురేఖలను ఉధ్దేశపూర్వకంగా మార్చేందుకు ప్రయత్నించడం నేరం. లెవెల్‌ 2 అఫెన్స్‌ కింద నిషేధం ఎదుర్కొనే అవకాశముంది. ప్రస్తుతం ఆ ఓవర్‌కు సంబంధించిన ఫుటేజ్‌ తమతోనే ఉందని వెల్లడించారు.కాగా ఈ మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటర్‌ సిడెల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 , రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.