హోలీ పండుగకు ఉట్టికి సిద్ధమైన జట్లు బషీరాబాద్

 

 

 

 

 

 

మార్చి 08, (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో నేడు తాండూరులో భద్రేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగే హోలీ సంబరాలలో బషీరాబాద్ మండలం నుండి ఉట్టి కొట్టడానికి 8 జట్లు సిద్ధమైనట్లు బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు తాహేర్ బాండ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు హోలీ సంబరాలలో పోటీలను జయప్రదం చేయండి అంటూ మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం చేసి,పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వారు పోటీలో పాల్గొని బహుమతులు గెలవడంతోపాటు, పోటీలో ఎక్కువ మంది యువకులు పాల్గొనాలని చెప్పారు.మొదటి బహుమతి నగదు 50వేల రూపాయలు, రెండవ బహుమతి నగదు 25వేల రూపాయలుగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తారని, అలాగే హోలీ వేడుకలు వేలాది మందితో ఘనంగా నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వడ్డే శ్రీనివాస్,ప్రజా బందు టీం, వివిధ గ్రామాల యువకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.