అందమైన అనుబంధం అంతులేని అనురాగం
అన్నా చెల్లెళ్ల బంధం రక్షా- బంధన్ శుభాకాంక్షలు
రాఖీ ఎందుకు కడతారంటే….
కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 31 రాఖీ పండగ అనగానే అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం ఎంతో గొప్పది.నిజంగా ఆ బంధాన్ని వివరించడానికి మాటలు సరిపోవు నిజంగా సోదరి,సోదరుడు మధ్య ఉండే బంధం ఎంతో అమూల్యమైనది అందుకే రక్షా బంధన్ నాడు ప్రేమని చూపించి జరుపుకుంటూ ఉంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో రక్షా బంధన్ కూడా ఒకటి రాఖీ,లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అనికూడాపిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకొనేవారు హిందువులు,జైనులు,సిక్కులు, ముస్లిం, బౌద్ధులు, క్రైస్తవులు జరుపుకొనే రోజుపౌర్ణమి (శ్రావణ పౌర్ణమి)రక్షా బంధన్ ఎలా ప్రారంభమైందంటే ద్రౌపది – శ్రీకృష్ణుని బంధం సవరించు ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది.శిశుపాలుడి ని శిక్షించే క్రమంలోసుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట.అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట.దానికి కృతజ్ఞతగాఎల్లవేళలా అండగాఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు.అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలోఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలి చక్రవర్తికి రక్షాబంధం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది.అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.(ప్రాచీన గాథ ” యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల” భావం- ఓ రక్షాబంధమా ! మహా బల వంతుడూ,రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు.కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)తన సోదరునుకు రక్షా బంధన్ సందర్బంగా సోదరి బొట్టు పెడుతూ చెల్లి సి.నిశ్చితా తనఅన్నయ్య సి.అక్షిత్ కుమార్ మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్య కు కట్టేదే ఈ రాఖీ.