అందరికి ఆసరా

రాజోలి 07 సెప్టెంబర్ (జనం సాక్షి)
అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్రమైన రాజోలి లో బుధవారం ఎంపీపీ మరియమ్మ నతనియెల్ ఆధ్వర్యంలో నూతన పింఛన్ దారులకు గుర్తింపు కార్డులను అందచేశారు. మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయితీ నుండి అర్హులకు కార్డులు అందచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా రాష్ట్ర ప్రజలకు అందిస్తూన్న అద్భుత సంక్షేమ పథకాల పై పక్క రాష్ట్రాలు చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. రైతులకు అవసరమయ్యే సాగునీటి ప్రాజెక్టులు నుండి వృదుల పింఛన్లు ఆడపడుచుల కల్యాణ లక్ష్మీ బాధ్యతలు తీసుకుని కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకున్న కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి రూపురేఖలను సీఎం కేసీఆర్ మారుస్తుంటే అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కి ఎమ్మెల్యే
అబ్రహం నిరంతరం అలుపెరగని యోధుడు లా పని చేస్తున్నారని అన్నారు.57 ఏళ్ళు దాటినా వారికి, ఒంటిరిగా ఉన్న మహిళలు, వికలాంగులకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పింఛన్లను మంజూరు చేపించిన ఘనత ఎమ్మెల్యే కి దక్కింది అని అన్నారు.మండలం మొత్తం 1217 పింఛన్లు మంజూరు కాగా మిగతా వారివి కూడా సాంకేతిక సమస్యల కారణంగా నిలిచాయని. త్వరలోనే అవి పూర్తి చేయటం జరుగుతుంది అన్నారు. ఎమ్మెల్యే తిరిగి వెళ్లే క్రమంలో విఆర్ఏలు ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసి వారి సమస్యను ఆయనతెలుపుతూ పే స్కేల్ అమలు చేస్తామని, 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ 09/09/2020 న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు స్పందన లేదని మా సమస్యపై కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుగుణమ్మ,వైస్ ఎంపీపీ రేణుక,జిల్లా కో అప్షన్ సభ్యులు నిషాక్,మర్ల బీడు గోపాల్, శ్రీరామ్ రెడ్డి,గంగి రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు