అందరి చూపు పాక్‌ ఇండియా మ్యాచ్‌ పైనే


న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): సాధారణంగా భారత్లో క్రికెట్‌ అంటే ఏ రేంజిలో క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు క్రికెట్‌ మ్యాచ్‌ వస్తుంది అంటే మాత్రం ఇక టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు కోట్ల లోనే ఉంటారు.. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. సాధారణంగా టీమిండియా ప్రపంచంలోని అన్ని దేశాలతో కూడా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతూ ఉంటుంది. ఇలా ఏ దేశంతో టీమ్‌ ఇండియా ఆడిన రాని మజా కేవలం పాకిస్థాన్తో ఆడితే మాత్రం వస్తుంది అని చెప్పాలి. ఇక పాకిస్తాన్‌ టీం ఇండియా మధ్య మ్యాచ్‌ జరుగుతుంది అంటే కేవలం భారత ప్రేక్షకులు మాత్రమే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌ వీక్షిస్తూ ఉంటారు. ఆ రేంజ్‌ లో పాకిస్తాన్‌ భారత్‌ మ్యాచ్‌ క్రేజ్‌ ఉంటుంది. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి భారత్‌ పాకిస్తాన్‌ తో మ్యాచ్‌ లు ఆడటం లేదు. ఇక ఒకవేళ క్రికెట్‌ ప్రేక్షకులు భారత్‌ పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ చూడాలి అనుకుంటే కేవలం ఐసిసి టోర్నీలో మాత్రమే చూసే అవకాశం దక్కుతుంది. ఐసీసీ టోర్నీలో భారత్‌ పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ ప్రేక్షకులు మాత్రం భారత్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో టి20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ వరల్డ్‌ కప్‌ లో అటు పాకిస్తాన్‌ భారత్‌ మధ్య హోరాహోరి మ్యాచ్‌ కి అంతా సిద్ధమైంది. మరో విషయం ఏంటంటే ఇక ఐసీసీ టి20 వరల్డ్‌ కప్‌ లో భారత్‌ ఆడుతున్న మొదటి మ్యాచ్‌ అటు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ తోనే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌ ఫై ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి-20 ప్రపంచ కప్‌ లో టీమ్‌ ఇండియా జట్టు తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌ తోనే ఆడటం ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరంభ మ్యాచ్‌ లోనే పాకిస్థాన్తో ఆడితే టీమిండియాకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇక మొదటి మ్యాచ్‌ పాకిస్తాన్‌ తో జరిగితే ఇక మిగితా మ్యాచ్లపై ఆటగాళ్లు ఎంతో స్వేచ్చగా దృష్టి పెట్టగలరు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు కూడా అంతే అనుకోండి అంటూ తెలిపాడు. ఇక ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ రెండు జట్లు మాత్రం ఆరంభంలోనే తడబడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ గౌతం గంభీర్‌ చెప్పుకొచ్చాడు.