అంబరన్నటిన సంబరాలు – ఘనంగా పూల పండగ
డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి
పట్టణ కేంద్రంలో ఎనిమిదో వార్డులో కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం,ఫ్లోర్ లీడర్ సురేందర్ జైన్ హాజరై బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు.అనంతరం సంబరాలు అంబరన్నాంటాయి.
భక్తి శ్రద్దలతో గౌరమ్మను పూజించుకుని బతుకమ్మను పెర్చుకున్నారు.సాయంత్రం 5 గంటలకు ఇండ్లలోనుండి బతుకమ్మల్తో చేరుకున్నారు.ఒక్కొక్కరు కాస్త వందలాదిమంది మహిళలు గౌరమ్మ బతుకమ్మలతో బతుకమ్మ ఆడారు.మహిళలు బతుకమ్మలతో రావడంతో పూలపండుగతో ఆ ప్రాంతం పులకరించింది.ఆ ఆవరణకి చేరుకుని మహిళలంతా బతుకమ్మ ఆడారు.చిన్నా పెద్దా అనే తేడాలేకుండా పాటలకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ హోరేత్తించారు.కార్యక్రమంలో వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area