*అంబేద్కర్ భవన నిర్మాణానికి 10 లక్షలు కేటాయిస్తానన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

కొడకండ్ల, జులై15(జనం సాక్షి):
కొడకండ్ల మండలంలోని  ఎస్సీ కాలనీ నాయకులు,తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ దళిత రత్న అందె యాకయ్య, కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము ఆధ్వర్యంలో శుక్రవారం రోజున హనుమకొండలోని మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతి రాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. అనంతరం కొడకండ్ల ఎస్సీ కాలనీ నాయకులు మాట్లాడుతూ కొడకండ్ల మండలంలో అధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం మంత్రి దయాకర్ రావు సానుకూలంగా స్పందించి అట్టి నిర్మాణానికి 10 లక్షలు రూపాయలు కేటాయిస్తానని చెప్పడం పట్ల దళిత వర్గాల ప్రజలు సంతోష వ్యక్తం చేశారని, ఈ మండల ప్రజలు వారి వెంటే ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా అధిక మెజార్టీ ఇచ్చి వారి రుణం తీర్చుకుంటామని ఏ నియోజక వర్గంలో లేని విధంగా పాలకుర్తి నియోజకవర్గానికి అధికంగా దళిత బంధు తీసుకొచ్చిన ఘనత మన దయాకర్ రావుకు దక్కిందని వారు కొనియాడారు. దళితుల అభివృద్ధి కోసం అంబేద్కర్ రాజ్యాంగం కల్పిస్తే దానిని అమలు చేసే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ జ్యోతి రవీంద్రగాంధీ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు సిందె రామోజీ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె చంద్రయ్య, దళిత నాయకులు అందె సోమయ్య,అందె చిన్న సోమయ్య,అందె రవీందర్, రవికుమార్, వెంకన్న,మల్లేష్, రాజు, రవి, వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.