అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

 

పినపాక నియోజకవర్గం జూలై 23 (జనం సాక్షి):రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమల రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన బాపూజీ నగర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ఖమ్మం లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలకు అవమానం జరకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను రూపోందించాలన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టం తీసుకురావాలన్నారు.ప్రతిరోజు
దేశంలో ఏదో ఒక ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలకు అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా
తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలోని గొప్ప మేధావిగా పేరుగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇతర దేశాలలో దైవంగా భావిస్తూ పూజిస్తు
న్నారని, మన దేశానికి దిశానిర్దేశం చూపిన మహనీయునికి అవమానం జరగటం చాలా బాధాకరం అన్నారు . అంబేద్కర్ దేశ ప్రజలందరికీ దైవం లాంటి వారని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహాల
వద్ద ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు
చేయాలన్నారు . పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాల
న్నారు. అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.