అకాల వర్షానికి భారీగా 65 ముగజీవాలు మృతి
ఇస్పూర్ జనంసాక్షి న్యూస్:
ఇటీవల వారం రోజుల పాటు ఏకదాటిగా కురిసిన అకాల వర్షాలతో మండలంలోని ఇస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద గోండుగూడ గ్రామా గిరిజన ఆదివాసీ మెస్రం భీంరావుకు చెందిన 40ఆవులు 25 దూడలు మొత్తం 65 పశువులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చల్లని ఈదురు గాలులకు సరిగా పశుగ్రాసం దొరకకపోవడంతో అవి ఎక్కడికక్కడ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జీపీ సర్పంచ్ జాధవ్ రమేష్ సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించారు. స్పందించిన మండల పశువైద్య శాఖ అధికారి సునీల్ కుమార్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగోరావు విఆర్వో దినకర్ లు శనివారం రోజున జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని పశు యజమానితో అడిగి తెలుసుకుని పంచనామా నిర్వహించి పరిశీలించారు. ఇంత పెద్ద ఎత్తున 65 ముగజీవాలు మృత్యువాత పడ్డా ఆవులను చూసి కంగుతిన్న గిరిజన పశు యజమాని ప్రభుత్వం వెంటనే అదుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.