అక్బరుద్దీన్‌కి స్వల్ప అస్వస్థత : రిమ్స్‌ వైద్యుల చికిత్స

ఆదిలాబాద్‌: మౌలిక సదుపాయాలు, పరిస్థితులు సమీక్షించేందుకు ఈరోజే న్యాయమూర్తి ఆదిలాబాద్‌ జిల్లా జైలును సందర్శంచారు. జిల్లా జైలులో ఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ తనకు కడుపులో నొప్పిగా ఉందని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు వైద్యులు అక్బరుద్దీన్‌కు చికిత్స అందిస్తున్నారు.