అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
కందుకూరు, జూలై 18 : పట్టణ పరిధిలో మన్నేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను రూరల్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పట్టుకున్న టిప్పర్లను రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించి మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.