అక్రమ అరెస్టులతో ఉద్యమ గొంతుకలను అణగదొక్క లేరు : సిపిఎం

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  17) :
వరద ప్రభావిత ప్రాంతాల్లో   ప్రజలు పడే ఇబ్బందులను  అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో  అక్రమ అరెస్టులు  చేసి ఉద్యమ గొంతుకలను అణగదొక్క లేరని   సిపిఎం మండల కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.  ముంపు  ప్రాంతాల ప్రజల సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రం అందించేందుకు వెళ్లిన  నాయకుల   అక్రమ అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యుడు రాయ్ రాజా మాట్లాడుతూ  గోదారి వరద బాధితులకు  సహాయక చర్యలు ముమ్మరం చేయాలని  కరకట్ట నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు. ఆర్థికంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి నష్ట పరిహారాన్ని చెల్లించాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన  సిపిఎం రాష్ట్ర నాయకులు  ఎ జె రమేశ్ బ్రహ్మచారి  నర్సిరెడ్డి  గడ్డం స్వామిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం మండల కమిటీ సభ్యులు రామడుగు వెంకటాచారి  మిర్యాల మోహనరావు  నాగుల్మీరా దాసరి సీతారాములు చల్లపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు.
Attachments area