అఖిలపక్షానికి పార్టీ అధ్యక్షులే రావాలి

కోదండరామ్‌ కూడా వస్తారు
స్పష్టమైన వైఖరి చెప్పని వారిని తెలంగాణలో తిరగనివ్వం : కేసీఆర్‌
లిఖిత పూర్వకంగా వైఖరి వెల్లడించాలి
కాంగ్రెస్‌ వైఖరి ముందు వెల్లడించాలి
వైకాపా, టీడీపీలు కూడా తమ వైఖరి చెప్పి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలి
జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధినేతలే హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన టీ జేఏసీ నేతల సమావేశం అనంతరం కోదండరామ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ 28న అఖిలపక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధ్యక్షులు హాజరై తెలంగాణకు అనుకూలమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి చంద్రబాబు, వైఎస్సార్‌ సీపీ నుంచి వైఎస్‌ విజయలక్ష్మి అఖిలపక్షానికి హాజరు కావాల్సిందేనని ఆయన అన్నారు. జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కూడా తనతో పాటు అఖిలపక్ష సమావే శానికి హాజరవుతారని తెలిపారు. కేవలం రాజకీయ పార్టీల ప్రతినిధులే సమావేశానికి హాజరుకావాలని లేఖలు రాశారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. టీ జేఏసీకి కోదండరామ్‌ చైర్మన్‌ అని తమ పార్టీ నుంచో, బీజేపీ నుంచో ఆయన ప్రతినిధిగా పాల్గొంటారని తెలిపారు. స్పష్టమైన వైఖరితో
అఖిలపక్షానికి వెళ్లాలి : కోదండరాం
అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో వెళ్లాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ చెప్తే తాము చెబుతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టీడీపీ అంటే సరిపోదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరి స్పష్టం చేసి, రాష్ట్ర ఏర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధ్యతను కాంగ్రెస్‌పై వదిలేయకుండా టీడీపీ, వైఎస్సార్‌ సీపీలు తమ తమ వైఖరులను వెల్లడించాలని కోరారు. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు హాజరుక ావాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌పై వంతెన మీదుగా బాబు జిల్లాలో అడుగుపెట్టింది మొదలు ఆయన అనుచరుల జలదోపిడీ మొదలైంది. ఆయనకు మోకాళ్ల నొప్పులు రావడంతో తారు రోడ్డుపై నడవొద్దని డాక్టర్లు సూచించారు. మట్టిరోడ్డుపై నడవాలని సూచించారు. లేకుంటే మోకాళ్లకు సర్జరీ తప్పదని హెచ్చరించారు. అప్పటి నుంచి ఆయన యాత్ర చేస్తున్న మార్గంలో దుమ్ము లేవకుండా నీళ్లు చల్లే ప్రక్రియకు తెరలేపారు. ఆయన పాదయాత్ర చేస్తున్న మార్గంలో ఉన్న రైతులను ముందస్తుగా స్థానిక టీడీపీ నాయకులు సంప్రదిస్తున్నారు. వారు స్వచ్ఛందంగా నీరందించేందుకు ఒప్పుకుంటే సరి లేకుంటే తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ ట్యాంకర్లను బావుల వద్దకు తీసుకొచ్చి మరీ నీళ్లు నింపుకెళ్తున్నారు. ఇలా ఒక్కో రోజు బాబుయాత్ర మార్గంలో 14 లారీలు, ట్యాంకర్ల ద్వారా లక్షా నలభై వేల లీటర్ల నీటిని తరలించి రోడ్డుపై చల్లుతున్నారు. నీటిని తెచ్చేందుకు పంటచేలను కూడా వాహనాలతో ఇష్టం వచ్చినట్లుగా తొక్కేస్తున్నారు. వీరి దౌర్జన్యాన్ని ప్రశ్నించే ధైర్యం లేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. ఎకరాల పంట చేలను తడిపే నీటిని టీడీపీ నేతలు దౌర్జన్యంగా దోపిడీ చేస్తూ వస్తున్నా మీకోసం అనడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార దాహంతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఇప్పుడే ఇంత దారుణానికి ఒడిగడుతుంటే గద్దె ఎక్కిన తర్వాత తెలంగాణ ప్రాంతం పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బాబు దండు దౌర్జన్యం ఆపాలని పలువురు కోరుతున్నారు.