అగ్రస్థానంలోనే అజరెంకా , ఫెదరర్
టాప్ టెన్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నో ఛేంజ్
న్యూయార్క్,సెప్టెంబర్ 17
ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఈ వారం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత వారం టాప్ ప్లేస్‌లో ఉన్న అజరెంకా , ఫెదరర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. టాప్ ట్వంటీలో కూడా ఎవ్వరి స్థానాలు మారలేదు. యుఎస్ ఓపెన్ తర్వాత చిన్న టోర్నీలు ఉన్నప్పటకీ టాప్ ప్లేయర్స్ కొంతమంది విశ్రాంతికే పరిమితయ్యారు. దీంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో ఎటువంటి మార్పూ రాలేదు. వచ్చే నెలలో జరగనున్న ఇస్తాన్‌బుల్ టోర్నీ తర్వాత ర్యాంకింగ్స్‌లో మార్పు చోటు చేసుకునే అవకాశముంది.
మహిళల ర్యాంకింగ్స్ – టాప్ 10 ః
1. విక్టోరియా అజరెంకా – బెలారస్ – 10265 పాయింట్లు
2. మరియా షరపోవా – రష్యా – 8435 పాయింట్లు
3. రడ్‌వాన్‌స్కా – పోలండ్ – 8295 పాయింట్లు
4. సెరెనా విలియమ్స్ – అమెరికా – 7900 పాయింట్లు
5. పెట్రా క్విటోవా – చెక్‌రిపబ్లిక్ – 6690 పాయింట్లు
6. అంగెలీ కెర్బర్ – జర్మనీ – 5085 పాయింట్లు
7. సారా ఇరానీ – ఇటలీ – 4755 పాయింట్లు
8. లినా – చైనా – 4526 పాయింట్లు
9. సమంత స్టోసర్ – ఆస్టేల్రియా- 4200 పాయింట్లు
10. మరియన్ బర్తోలీ – ఫ్రాన్స్ – 3800 పాయింట్లు
పురుషుల ర్యాంకింగ్స్ – టాప్ 10 ః
1. రోజర్ ఫెదరర్ – స్విట్జర్లాండ్ – 11805 పాయింట్లు
2. నోవక్ జొకోవిచ్ – సెర్బియా – 10470 పాయింట్లు
3. ఆండీ ముర్రే – బ్రిటన్ – 8570 పాయింట్లు
4. రఫెల్ నాదల్ – స్పెయిన్ – 7515 పాయింట్లు
5. డేవిడ్ ఫెర్రర్ – స్పెయిన్ – 5915 పాయింట్లు
6. థామస్ బెర్డిచ్ – చెక్ రిపబ్లిక్ – 4830 పాయింట్లు
7. విల్‌ఫ్రెడ్ సోంగా – ఫ్రాన్స్ – 4520 పాయింట్లు
8. మార్టిన్ డెల్‌పొట్రో – అర్జెంటీనా – 3890 పాయింట్లు
9. టిప్సారెవిచ్ – సెర్బియా – 3285 పాయింట్లు
10. జాన్ ఇస్నర్ – అమెరికా – 2610 పాయింట్లు