అగ్రహారం-ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామికి నాకు చిన్నప్పటి నుంచి దోస్తీ. నా మెడలో హనుమంత రక్ష వుండేది. ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు భయం వేసినా ఆంజనేయస్వామికి మొక్కుకునేవాణ్ని. ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకునేవాడిని.ఎలాంటి సమస్యలు వచ్చినా ఆంజనేయస్వామికి మొక్కుకుంటే ఆ సమస్యలను అతను తీరుస్తాడని మా ఇంట్లోవాళ్లకి నమ్మకం. నా చిన్నప్పుడు నా ప్రాణం పొయ్యే పరిస్థితి వున్నప్పుడు ఆంజనేయస్వామే కాపాడినాడని మా అమ్మ నమ్మకం. ఐదారేళ్ల వయసులో వున్నప్పుడు ‘ఏకాణ’ (ఆరుపైసల బిళ్ల)తో ఆడుతూ ఆ బిళ్లను మింగానట. మా వినోదక్క పరుగున్న వెళ్లి మా అమ్మకు ఆ విషయం చెప్పింది. ఇది మధ్యాహ్నంపూట జరి గింది. ఏకాణ బిళ్ల నా గొంతులో ఇరుక్కుపోయింది. మా అమ్మకు ఏమీ తోచలేదు. మా బాపు కూడా ఊర్లోలేడు. కరీంనగర్‌ పో యాడు. ఎవరో చెబితే అరటిపండును తినిపించింది మా అమ్మ. ఏ కాణ గొంతునుంచి జారలేదు సరికదా మొత్తం అరటిపండుని వాం తి చేసుకున్నాను.అది సమాచార యుగం కాదు. మా బాపుకి ఆ విష యం తెలియజేసే అవకాశం లేదు. మా వూర్లో మా బాపు తప్ప వేరే డాక్టర్‌ లేడు. మధ్యాహ్నం నుంచి మా అమ్మకు ఒక్కటే వత్తిడి. చెంచాతో పాలు తాగించడం, నా దగ్గర కూర్చోవడం తప్ప మరేం పనిలేదు మా అమ్మకు. ఇంట్లో వాతావరణం సీరియస్‌గా మారి పో యింది.మా అమ్మ దేవుళ్లకి మొక్కడం ప్రారంభించింది. నా నిలువెత్తు బెల్లం పంచిపెడతానని మా రాజేశ్వరుడికి మొక్కుకుంది. కుండెడు కల్లు పోయిస్తానని మా బద్దిపోచమ్మకి మొక్కుకుంది. దిష్టికుంభం పోయిస్తానని మా మహిషాసురమర్దనికి మొక్కుకుంది. గండాదీపంలో నూనె పోయిస్తానని కూడా మొక్కుకుంది. అయినా ఏకాణ బిళ్ల నా గొంతు నుంచి జారలేదు.

సాయంత్రం అయినకొద్దీ మా అమ్మ ఎక్కువ ఒత్తిడికి లోనైంది. మా బాపు ఆరోజు రాలేదు. మా అమ్మకి కంటిమీద కునుకు లేదు. మా చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఏమీ కాదని మా అమ్మను ఓదార్చినారు. మా మల్లయ్య పోచమ్మ తల్లికి కల్లుపోయించి వచ్చాడు. మా వినోదక్క వెళ్లి గండాదీపంలో నూనెపోసి వచ్చింది. రాజేశ్వరునికి కొబ్బరికాయ కూడా కొట్టి వచ్చింది. అయినా ఏకాణ నా గొంతు నుంచి జారలే దు.తెల ్లవారి మధ్యాహ్నంపూట మా బాపు వచ్చాడు. ఆయ నకు ఏమీ తోచలేదు. ఎంతోమందికి వైద్యం చేసిన మా బాపుకి ఏం చెయ్యాలో అర్థంకాలేదు. కొన్నైనా పాలు లోపలికి పోతున్నాయని ఆయన కుదుట పడ్డాడు. అంతగా భయపడలేదు. కానీ మా అమ్మకు ఒక్కటే భయం. అప్పుడు బస్సు సౌకర్యాలు కూడా అంతగా లేవు. అందుకని ఉదయం పట్నం తీసుకె ళ్దామని బాపు అమ్మకి చెప్పిండు. చేసేది ఏమీలేక మళ్లీ దేవునికి మొక్కి నన్ను పట్టుకునే కూర్చుంది. చెంచాతో పాలు తాగిస్తూ అలాగే వుండిపోయింది.

ఆ తెల్లవారి మబ్బుల మా అమ్మా, బాపు, నేనూ, మా మల్లయ్య మొదటి బస్సులో పట్నం (హైదరాబాద్‌) బయల్దేరినాం. బస్సు అగ్ర హారం దాటి సిరిసిల్ల నుంచి కామారెడ్డి వచ్చి పట్నం వెళ్లాలి. మా వేములవాడ, సిరిసిల్లకి మధ్యన అగ్ర హారం. ఆంజనేయస్వామి గుడి. మా బస్సు క్రాసిం గ్‌దాటి అగ్రహారంవైపు వెళ్తుండగా మా అమ్మకి ఆంజనేయస్వామి గుర్తుకొచ్చిండు. అగ్రహారంలోని సంకట విమోచన ఆంజనేయస్వామికి మొక్కుకోనం దుకు తనని తానే తిట్టుకుంది. వెంటనే రెండు చేతులెత్తి ఆంజనేయస్వామికి మొక్కుకుంది. నాతో బాటు తనూ 21 ప్రదక్షిణలు చేసి ఐదు కొబ్బరి కాయలు కొడుతానని మొక్కుకుంది. రాముని సమ స్యనే తీర్చినవాడు తన సమస్యను తీర్చడా అని మా అమ్మ నమ్మకం. ఆ నమ్మకం ఆవిడకి కొండంత బలాన్నిచ్చింది.హైదరాబాద్‌ బస్టాండ్‌లో దిగి నేరుగా టాంగాలో ఉస్మానియా దవాఖానికి తీసుకొని పోయి నారు. డాక్టర్లు పరీక్షలు జరిపి ఓ రెండు గంటల తరువాత ‘ఏకాణ’ బిళ్లని నా గొంతు నుంచి బయ టకు తీశారు. ఆ బిళ్లని మా అమ్మకు ఇచ్చారు. ఆ బిళ్ల ఇంకా మా ఇంట్లో వుంది. ఆంజనేయస్వామి ఇచ్చిన నమ్మకం వృథా కాలేదు. ఆరోజు దవా ఖానాలోనే వుండి తెల్లవారి మా వేములవాడకి వచ్చేశాం.

మా వూర్లో నేను ఏకాణ మింగిన పిల్లవాడిగానే ప్రసిద్ధి. నన్ను అట్లాగే పిలిచేవాళ్లు. ఆ తరువాత నేనూ మా అమ్మ అగ్రహారం వెళ్లి 21 ప్రదక్షిణలు చేశాం. ఈ కథని మా అమ్మ సందర్భం వచ్చిన ప్పుడల్లా చెప్పింది. బహుశా లక్షా తొంభైసార్లు చెప్పి వుంటుందేమో. మా అమ్మ సమస్యను ఆంజనేయస్వామి ఆ విధంగా పరిష్కరించారు.

మా వేములవాడలో రెండు మూడు ఆంజనేయస్వామి గుళ్లు వున్నప్పటికీ ఆంజనేయస్వామి అంటే అందరికీ గుర్తొచ్చేది అగ్రహారమే. ఆ తరువాత గుర్తొచ్చేది భీమన్న గుడిలోని ఆంజ నేయస్వామి గుడి. పెద్ద రావిచెట్టు. దాని పక్కనే గుడి. రావిచెట్టు మీద తలకిందులుగా వేలాడుతున్న గబ్బిలాలు. ఆ గంభీరమైన వాతావరణంలో ఆంజనేయస్వామి.

మా భీమన్న గుళ్లో ఓ పెద్దతోట వుండేది. ఆ జామకా యలు తెంపుకోవాలని ఎంతో కోరికవున్నా తోటమాలి పోచెట్టి భయానికి తెంపుకోలేకపొయ్యేవాణ్ని. మా ఇంట్లో ఓ మార్వాడీ కుటు ంబం కిరాయికి వుండేది. అతను ఆంజనేయస్వామి భక్తుడు. ప్రతి శనివారం ఆంజనేయస్వామికి పూ జలు చేసేవాడు. ఆంజనే య స్వామి సింధూరం పూసేవాడు. అప్పుడప్పుడూ నన్ను తనతో బాటు తీసుకొనిపొయ్యేవాడు. ఆయనతో పోవడం వల్ల జామ కాయలు తెంపుకోవడానికి నాకు భయం వుండేదికాదు. ఆంజనేయ స్వామి ఆ విధంగా నాకు తోట మాలి పోచెట్టి భయం లేకుండా చేశాడు.

పరీక్షలైపోయిన తర్వాత పిల్లలం దరం ఒకే రూంలో పడుకు నేవా ళ్లం. పరీక్షలున్న రోజుల్లో ఎని మిదింటికే నిద్ర ముంచు కొచ్చేది. కానీ ఆ తరువాత నిద్రనేదే లేదు. నిద్ర వచ్చేదికాదు. రాణీ, భాగ్యం, చిట్టి రాజేందర్‌, గుణక్క, ప్రసాద్‌, నేనూ అందరం కథలు చెప్పుకుం టూ పడుకునేవాళ్లం. ఎవరో ఒకరు దొంగల కథో, దయ్యాలకథలో చెప్పేవాళ్లు. అప్పటినుంచి మొదల య్యేది భయం. అప్పటిదాక చల్లగా వున్న వాతావరణం వేడెక్కిపొయ్యేది. పక్కగదిలో పెద్దవాళ్లు వున్న ప్పటికీ వాళ్లని పిలువలేం. ఇంకా పడుకోలేదని తిడతారని భయం. అందుకని మేమందరం ఆంజనేయస్వామి దండకం చదువు కునేవాళ్లం. చదువుకునే క్రమంలో ఎప్పుడు నిద్రపట్టేదో తెలిసేది కాదు. మా భయాలు, సమస్యలు ఆంజనేయస్వామికి ఓ లెక్కా పత్రా మా? దం డకం చదువుతుండగానే నిద్రాదేవిని మా దగ్గరికి పంపిం చేవాడు. మేం నిద్రలోకి జారుకునేవాళ్లం.ట్యూషన్‌ నుంచి ఇంటికి వచ్చేట ప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్లు వుండేవాళ్లు. వాళ్లు లేనప్పుడు చీకట్లో నడిచి వస్తున్నప్పుడు విపరీతంగా భయం వేసేది. ఆ భయా నికి నా దగ్గరున్న ఏకైక విరుగుడు ఆంజనేయ స్వామి. ఆయన దండ కం. ఇదీ ఆంజనేయస్వామితో నాకున్న దోస్తీ. పరీక్షలైపోయిన తర్వా త అగ్రహారం వెళ్లడం మా వూరి విద్యా ర్థులకి తప్పనిసరి. నిజా నికి మా వూరి వాళ్లందరికీ అగ్రహారంతో అవినాభావ సంబంధం. మా వూరివాళ్లు ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా నడుచుకుంటూ అగ్రహారం పోవా ల్సిందే. అక్కడున్న చెట్లకింద వనభోజనాలు చేయా ల్సిందే. ఆంజనే యస్వామిని దర్శించాల్సిందే. చెట్లకింద జంప ఖానాలు వేసుకొని ఆ చింతచెట్ల నుంచి ఆకాశాన్ని చూస్తూ పడు కోవడం ఓ గొప్ప అనుభూతి. పిల్లలు మాత్రం సంవత్సరానికి రెండు సార్లు అగ్రహారానికి పొయ్యేవాళ్లు. పరీక్షలైపోయిన తర్వాత ఒకసారి, శ్రావణమాసంలో మరోసారి.

మా వూరికి సిరిసిల్లకి మధ్య దూరం 12 కిలోమీటర్లు. రెండు గ్రామాలకు మధ్‌యలో అగ్రహారం. పేరుకి అగ్రహారమే కాని అక్కడ ఆంజనేయస్వామి గుడి, పది రూంలు తప్ప మరేమీ వుండేది కాదు. పూజారి ఇల్లు కూడా వుండేది. ఆంజేయస్వామివి రెండు విగ్ర హాలు వుండేవి. ఒకదానిపక్కన మరొకటి. రెండు విగ్రహాలు ఎందు కు వున్నాయో తెలియదు. రాములవారి గుడి, శివుని లింగం, తుల సి విగ్రహం కూడా అక్కడ వు న్నాయి.గుడికి కుడిపక్కన బావి. నీళ్లు చేదుకోవడానికి బొక్కెన. మా వేములవాడ సిరిసిల్ల రెండు గ్రామాలకి మధ్యన అగ్రహారం వుండడం వల్ల రెండు గ్రామాల ప్రజ లు ఇక్కడికి దర్శనానికి వచ్చేవాళ్లు. కొత్తగా ఎవరైనా వాహనం కొంటే ఆ వాహ నాన్ని అగ్రహారం తీసుకొని వచ్చి పూజలు చేయించాల్సిందే. దసరా రోజు కూడా తమ వాహనాలని ఇక్కడికి తీసుకొని వచ్చి పూజలు చేయి స్తారు.

ఇప్పుడు గుడి రూపురేఖలు మారిపోయాయి. గుడి చుట్టూ పెద్దప్రహరీ గోడ కట్టారు. రోడ్డుమీదికి కన్పించేలా నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాహనాలు పెరిగి సౌకర్యాలు పెరిగి చాలా ప్రదేశాలు చూసే ఏర్పడిన తర్వాత మా చిన్నతనంలో మాదిరిగా ఇప్పుడు వనభోజనాలకిఅగ్రహారంరావడంతగ్గిపోయింది.

సిరిసిల్ల పాత తాలూకా. వేములవాడ కొత్త తాలూకా. ఆ తరువాత మండలాలుగా మారిపోయాయి. సిరిసిల్ల రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న వూరు. మా వేము లవాడ రాజేశ్వరుని దగ్గర అంతులేని ధనం. ప్రతి సంవ త్సరం ఆయన ఆదాయం పెరిగిపోతూనే వుంది. ఏ అభి వృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా దేవస్థానం డబ్బులమీదే అందరి కండ్లు పడేవి. దేవస్థానం డబ్బులు ఎక్కువగా సిరి సిల్ల అభివృద్ధికే వినియోగిస్తున్నారని మా వేములవాడ ప్రజల నమ్మకం. అందుకని రెండు గ్రామాల మధ్య పాలి పోరు వుండేది.ఓసారి పాలిటెక్నిక్‌ కాలేజీ పెట్టాలన్న ప్రసక్తి వచ్చింది. ఆ కాలేజీకి దేవాలయం నిధులని ఇచ్చిం ది. కాలేజీని సిరిసిల్లలో పెట్టారు. వేములవాడ వాళ్లు నానా గొడవ చేశారు. మా దేవస్థానం నిధులు – కాలేజీ మీ వూర్లోనా? అని హుంకరించేవారు.

మరి కొంతకాలానికి వేములవాడలో డిగ్రీ కాలేజీ పెట్టా లని వేములవాడ ప్రజలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరీంనగర్‌లో రాజరాజేశ్వరస్వామి పేరుతో కాలేజీ వుంది. అందుకని వేములవాడలో భీమేశ్వరస్వామి డిగ్రీ కాలేజీ పెట్టాలన్న ప్రతిపాదన చేశారు. ఆ రకంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.ఈ విషయం తెలిసిన సిరిసిల్ల ప్రజల్లో కదలిక మొదలైంది. పాలివాండ్ల మధ్య దీక్షల దాకా వెళ్లిం ది. దేవస్థానం మీ వూర్లో వుంది కానీ దేవుని సొమ్ము మీది కాదు. నియోజకవర్గం పాత తాలూకా అయిన సిరిసిల్లలో కాలేజీ పెట్టాలన్న ప్రకటనలు ప్రతిరోజూ పత్రికల్లో కన్పిం చడం మొదలైంది.రెండు వూర్ల మధ్య సమస్య. రాజకీయ నాయకులకు సమస్యే. ఏ వూరి వాళ్లని సమర్థించనూ లేరు. వ్యతిరే కించనూలేరు. పట్టింపులు పెరిగాయి. పంతాలు పెరిగా యి. చిన్న సమస్య రావణుడి ముందు పెరిగిన ఆంజనే యునిలా పెరిగిపోయింది. ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందా? కాలేజీయే ఎవరికి కాకుండా పోతుందా అన్న సందేహం నాకు మల్లె ఎందరి లోనోఎన్నో సూచ నలు వచ్చాయి. ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి మధ్యేమా ర్గంగా అగ్రహారంలో కాలేజీ పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిం ది. అయితే తాత్కాలికంగా కూడా సిరి సిల్లలో కాలేజీ పెట్ట డానికి వీల్లేదన్నది వేములవాడ ప్రజల వాదన. చివరికి అంగీకారం కుదిరింది.

ఐదెకరాల స్థలం సిరిసిల్లలో లేనందున పాలిటెక్నిక్‌ కాలేజీ సిరిసిల్ల నుంచి అగ్రహారం వచ్చింది. అదే బిల్డింగులో డిగ్రీ కాలేజీ మొదలై బిడ్గింగ్‌ రూపం దాల్చింది.రెండు గ్రామాల సమస్యని మా అగ్రహారం ఆంజనేయస్వామే తీర్చాడని చాలామంది నమ్మకం. ఇప్పుడు అగ్రహారం ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రెండు కాలేజీలు.