లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

 

 

 

 

 

నవంబర్ 18 (జనంసాక్షి)మరో ట్రావెల్స్‌ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపు తప్పిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ  వద్ద జరిగింది.

కే. కావేరీ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్నది. ఈ క్రమంలో నందిగామ వద్ద జాతీయ రహదారిపై లారీని ఓవర్‌ టేక్‌ చేస్తుండగా బస్సుపై డ్రైవర్‌ అదుపు కోల్పోయాడు. దీంతో అది లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ వైపు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. కాగా, ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.