బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
మైథిలి ఠాకూర్ తొలి ఫలితాల్లో ముందంజ
అలీనగర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు రౌండ్‌ల వారీగా వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని జనరల్ నియోజకవర్గం అలీనగర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన జానపద గాయని, బీజేపీ సాంస్కృతిక రాయబారి మైథిలి ఠాకూర్ తొలి ఫలితాల్లో ముందంజలో ఉన్నారు.
ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే
- బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి హవా
- ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
- 71 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థుల ముందంజ
- మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యం
- బిహార్‌లో మళ్లీ చతికిలపడిన కాంగ్రెస్
- కేవలం 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ
- మహాగఠ్‌బంధన్ కూటమిలో ప్రధాన ఆర్జేడీ పార్టీకి 60 స్థానాల్లో ఆధిక్యం
- అలీనగర్‌లో సింగర్ మైథిలీ ఠాకూర్ ముందంజ
- లఖిసరయ్‌లో భాజపా అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా వెనుకంజ
- మొకామాలో జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్‌కు ఆధిక్యం
- మహువాలో వెనుకంజలోనే కొనసాగుతోన్న లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్
- ఆధిక్యాల్లో దూసుకెళ్తోన్న ఎన్డీయే
165 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ముందంజ
73 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు
5 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం
బిహార్ ఎన్నికలు.. ఫలితాల సరళి ఇలా..
- 174 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
- 66 స్థానాల్లో ముందంజలో ఉన్న మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు
- 3 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం
- ఈ ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ
బిహార్ ఎన్నికలు.. పార్టీల వారీగా ఆధిక్యాలు ఇలా..
- జేడీయూ – 79
- భాజపా – 74
- ఎల్‌జేపీ (ఆర్‌వీ) – 17
- ఆర్జేడీ – 47
- కాంగ్రెస్ – 11


