గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు ఇల్లు దగ్ధం

చేర్యాల నవంబర్ 18, (జనంసాక్షి) : గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యుల ఆరుగురికి తీవ్ర గాయాలై ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీకై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఇంట్లో ఉన్న భాస్కర్ తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య ముగ్గురు పిల్లలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంటలు చెలరేగుతూ ఇల్లు దగ్ధమైంది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి చేర్యాల సీఐ లక్కేపురం శ్రీను, ఎస్ఐ వేముల నవీన్ చేరుకొని పరిశీలించారు.