మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు
` 45 మంది హైదరాబాదీల మృతి
` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం
` ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు
` మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు
` మృతలంతా హైదరాబాద్‌ పాతబస్తీ వాసులు
` మక్కాకు వెళుతుండగా ప్రమాదం
` ప్రమాదంపై సీఎం రేవంత్‌ తీవ్ర దిగ్భ్రాంతి
` ప్రధాని మోడీ, తదితరుల సంతాపం
హైదరాబాద్‌(జనంసాక్షి): సౌదీ అరేబియాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. మదీనాకు సవిూపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. యాత్రికులతో వెళ్తోన్న బస్సు.. డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు సవిూపంగా భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. మక్కా నుంచి మదీనా వెళుతున్న యాత్రికుల బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్డడంతో మంటలు చెలరేగి పెద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. ఈమంటల్లో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపిన వివరాల ప్రకారం 54 మంది యాత్రికుల బృందం నవంబర్‌ 9 న హైదరాబాద్‌ నుంచి జెడ్డాకు బయలు దేరింది. నవంబర్‌ 23 వరకు టూర్‌ను ప్లాన్‌ చేశారు. వారిలో నలుగురు ముందుగానే కారులో మదీనాకు వెళ్లగా, మరో నలుగురు మక్కాలోనే నిలిచిపోయారు. మిగిలిన 46 మంది బస్సులో ప్రయాణం కొనసాగించారు. మదీనా నుండి సుమారు 25 కిలోవిూటర్ల దూరంలో బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చెలరేగిందని తెలిపారు. డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ షోయబ్‌ అనే యాత్రికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణించిన వారిలో మల్లేపల్లి, బజార్‌ఘాట్‌, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల వారూ ఉన్నట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 1.30 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులంతా నిద్రలో ఉండడం వల్ల మరణాలు అధికంగా నమోద య్యాయని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెడ్డా భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 24 ఏళ్ల మొహమ్మద్‌ అబ్దుల్‌ షోయబ్‌ డ్రైవర్‌ పక్కన కూర్చోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షోయబ్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. గాయాల పాలైన షోయబ్‌ను హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం బయటకు రాలేదు . ప్రమాదంలో షోయబ్‌ కుటుంబ సభ్యులందరూ చనిపోయినట్టు తెలుస్తోంది.
ఒకే కుటుంబంలో 18 మంది మృతి
హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. నసీరుద్దీన్‌ ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి. తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని కబళించింది. విషయం తెలుసుకున్న నసీరుద్దీన్‌ బంధువులు, స్నేహితులు అతడి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
సీఎం రేవంత్‌ దిగ్భార్రతి
సౌదీ అరేబియా సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్బార్రతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విూడియాలో వార్తలు వచ్చాయని.. ఈ ఘటనలో హైదరాబాద్‌ వాసులు కూడా ఉన్నారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెంటనే తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సి అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్‌ రామకృష్ణారావు ఢల్లీిలోని రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని సీఎస్‌ రామకృష్ణారావు కోరారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహాకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం 91 79979 59754, ?91 99129 19545 ఈ నెంబర్లలో సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ప్రధాని మోడీ తీవ్ర దిగ్భార్రతి
మక్కా యాత్రకు వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు మదీనాలో రోడ్డు ప్రమాదానికి గురై పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ’మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృత్యువాత పడటం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతి. గాయపడ్డ వారు అత్యంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రియాద్‌లో ఇండియన్‌ ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్‌ సాయం అందిస్తున్నాయి. భారత అధికారులు సౌదీ అధికారులతో ఈ ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నారు’ అని అన్నారు. కాగా, సోమవారం తెల్లవారు జామున భారతీయ యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
కుటుంబీలకు కిషన్‌ రెడ్డి, పిసిసి చీఫ్‌ల పరామర్శ
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. నజీరుద్దీన్‌ మృతితో స్థానికులు కన్నీరు పెట్టారు. నసీరుద్దీన్‌ ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి. తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని కబళించింది. విషయం తెలుసుకున్న నసీరుద్దీన్‌ బంధువులు, స్నేహితులు అతడి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబ బంధువులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హావిూ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. నసీరుద్దీన్‌ ఇంటికి వెళ్లి ఆయన బంధువులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు మొదలు పెట్టినట్లు చెప్పారు. మరోవైపు నసీరుద్దీన్‌ ఇంటి వద్ద రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని నమ్మలేకపోతున్నామంటూ ఆయన బంధువులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 18 మంది అంత్యక్రియలను సౌదీలోనే నిర్వహించనున్నట్లు నసీరుద్దీన్‌ బంధువులు పేర్కొన్నారు. మరోవైపు ఇదే ప్రమాదంలో.. హైదరాబాద్‌ పాతబస్తీ బహదూర్‌పురాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌ పరామర్శించారు. సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీళ్లంతా హైదరాబాద్‌ వాసులేనని తెలంగాణ హజ్‌ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం నాలుగు ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్‌ నుంచి వీరంతా ఉమ్రాకు బయల్దేరారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కి.విూ దూరంలో బస్సు`డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి.