సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

నవంబర్ 17, (జనంసాక్షి) హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్లినభారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో 42 మంది సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఇంగ్లిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. వారంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్నారని పేర్కొన్నాయి. మృతుల్లో 20 మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఇప్పటివరకు 42 మంది మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా ఎంతమంది చనిపోయారు, గాయపడ్డారనే విషయం తెలియాల్సి ఉన్నది.



