ఎమ్మెల్యే అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి

` స్పీకర్ సుప్రీం హుకుం
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోక పోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిగింది. కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడిరచారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన పిటిషన్లపై మూడునెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జులై 31న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే విభిన్న కారణాలవల్ల ఆలోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కానందున స్పీకర్‌కు మరో రెండునెలలు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్ అప్లికేషన్ సీజేఐ ధర్మాసనం ముందు 14వ నంబరులో లిస్ట్ అయింది. ఈక్రమంలో ఆయా పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది.



