అగ్రికెమ్ మూసివేత పనులకు గడువు పెంపు
శ్రీకాకుళం, జూలై 15 :
నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసి మూసివేందుకు మరో పది రోజులు గడువు పెంచుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనులకు పరిశ్రమ యాజమాన్యం తొలుత 17 రోజుల గడువు కోరింది. కాలుష్య నియంత్రణ బోర్డు మాత్రం వా రం రోజులే అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు జరిగిన పనులపై అందజేసిన నివేదిక పరిశీలించి మరో పది రోజులు గడువు పెంచింది. ఒకటో బ్లాక్‌లో 80 శాతం నిర్వీర్య ప్రక్రియ పూర్తియ్యిందని, మూడు, నాలుగు, ఆరు బ్లాక్‌ల్లో పనులు ప్రారంభించారని సహాయ పర్యావరణ ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు.