అడవుల రక్షణకు కఠిన చర్యలు
రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటల నివారణకు కార్యాచరణ
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్19(జనంసాక్షి): రిజర్వ్ ఫారెస్ట్ రక్షణకు అధికారులు నడుం బిగించారు. పోడు భూముల పేరుతో ఆక్రమణలు లేకుండా తగు చర్యలకు పూనుకుంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. దీంతో అడవుల పరిరక్షణకు ముందుగా రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాన్ని విభజిస్తూ ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అడవుల్లో మంటలు విస్తరించకుండా ప్రత్యేకంగా ఫైర్లైన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు. బీడీ ఆకు సేకరణ పేరుతో అడివికి నిప్పు పెడుతున్నందున వణ్యప్రాణులు అధికంగా ఉన్న కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ అటవీ ప్రాంతంలో మినహా జిల్లా వ్యాప్తంగా అడవుల్లో ఆకు సేక రణకు అనుమతి ఇచ్చామన్నారు. ఆకు సేకరణ కోసం అడివికి నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. రాన్నున్న కాలంలో అడవులకు మంటలు పెట్టడం వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అటవీ హక్కు పత్రాలు లేని పోడు భూములను స్వాధీనం చేసకుంటామని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టడాన్ని ఇకవిూదట సహించబోమని, రిజర్వ్ ఫారెస్టు యాక్ట్ పరిధిలో కఠిన చర్యలు తీసు కుంటామని అధికారులు స్పష్టం చేశారు. గడిచిన కొన్నేళ్ళుగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని ఒకే ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నట్లు గూగుల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇల్లెందు ఫారెస్టు డివిజన్‌లో 252 కంపార్ట్‌మెంట్లు ఉండగా అందులో 23 కంపార్ట్ మెంట్లలో ప్రతి ఏటా మంటలు చెలరేగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ నిఘాలో వెల్లడైందని పేర్కొన్నారు. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతులు మొక్కజొన్న చెత్తను తరగలబెట్టడం వల్ల మంటలు అడవిలోకి విస్తరించి అడవికి నష్టం చేకూరుతందున్నారు. ఇంతేకాకుండా బీడీ ఆకుల సేకరణ సందర్భంగా అడవికి మంటలు పెడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కలకు వేసవిలో పెట్టే మంటల వల్ల నష్టం చేకూరుతుందని, రక్షణ కోసం ఎప్పటికప్పుడు అప్రమతంగా ఉండాలని అటవీ సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో నే కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా అడవుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటు న్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తుచేశారు.