అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం

` ముగిసిన వివాదం
` టీపీసీసీ చీఫ్ నివాసంలో ఇరువురు మంత్రుల భేటీ
` కలిసి పనిచేయాలని మహేశ్ గౌడ్ సూచన
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల ఏర్పడిన అంతర్గత విభేదాలు సర్దుబాటు అయ్యాయి. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య చెలరేగిన వివాదానికి తెరపడిరది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకుని ఇరు నేతలకు సర్దిచెప్పడం తో సమస్య పరిష్కారమైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతుగా క్షమాపణ తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో ఈ మంత్రులిద్దరూ భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివాసంలో ఇరువురు మంత్రుల మధ్య సయోధ్య కుదిరింది. బుధవారం ఉదయం పీసీసీ చీఫ్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ విూటింగ్‌లో అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వివాదం ముగిసింది. దీనిపై పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల మరో మంత్రి లక్ష్మణ్ నొచ్చుకోవడంతో యావత్ సమాజం కొంత బాధపడిరదన్నారు. మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్యగా వెల్లడిరచారు. జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలని తెలిపారు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ మాట్లాడినా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సహచర మంత్రివర్గానికి కూడా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహాయంతో కుల సర్వే పారదర్శకంగా నిర్వహించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు చట్టాలు తీసుకొచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా.. కానీ ఆయన వాఖ్యల పట్ల మాదిగ జాతి బాధపడిరద న్నారు. అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని… పార్టీ లైన్ దాటే వ్యక్తిని కానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను ఆ మాట అనకపోయినా క్షమాపణలు చెబుతున్నా. పత్రికా కథనాలతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారు. అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నా. మంత్రి అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదు. కాంగ్రెస్ నేతలమంతా సామాజిక న్యాయం కోసం పని చేస్తాం అని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్.. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నట్లుగా వ్యాఖ్యలు సోషల్‌విూడియా లో రావడం.. వాటిపై లక్ష్మణ్‌కుమార్ ఓ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. తనపై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని, మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని అందులో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న విభేదాలు.. ఇప్పుడు బహిర్గతమయ్యాయన్న చర్చ జరిగింది. తాజాగా బుధవారం మహేశ్ కుమార్ గౌడ్, ముఖ్య నేతల చొరవతో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది. దీంతో పార్టీలో ఐక్యతను రక్షించేందుకు సంకేతం ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అడ్లూరి లక్ష్మణ్ ఇబ్బంది పడ్డారు. అందుకే భేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కుటుంబ సంబంధ సమస్యలుగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యను ఇంతటితో ముగించాలనే కోరుతున్నాను అని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుంది. ప్రతి కార్యకర్త, నాయకుడు ఐక్యంగా పని చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పారు.