అతడు ఉన్నాడుగా.. మళ్లీ ప్రపంచ కప్ మనదే: ధోనీపై యువీ ప్రశంసలు

spo-2గ్వాలియర్: భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీపై భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ధోనీ నాయకత్వంలో మరోసారి టీమిండియా ప్రపంచ కప్ ట్రోఫీని సాధిస్తుందని చెప్పాడు. ధోనీ సమర్థ నాయకత్వమే టీమిండియాకు బలమని, మిగితా ఆటగాళ్లు కూడా అంచనాలకు మించి రాణిస్తున్నారని పేర్కొన్నాడు. ‘సమర్థవంతమైన ధోనీ నాయకత్వంలో మరోసారి భారత జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని సాధిస్తుంది’ అని యువరాజ్ సింగ్ తెలిపాడు. ఐటిఎం విశ్వవిద్యాలయంలో ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా యువరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. అతడు ఉన్నాడుగా.. మళ్లీ ప్రపంచ కప్ మనదే: ధోనీపై యువీ ప్రశంసలు పెద్ద జట్లతో జరిగే 50 ఓవర్ల మ్యాచుల్లో ధోనీ ప్రణాళికలు మంచి ఫలితాన్నిస్తున్నాయని యువరాజ్ తెలిపాడు. సౌరవ్ గంగూలీతో కలిసి కరాజీలో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్‌ను ఎదుర్కొన్న తీరును యువీ గుర్తు చేసుకున్నాడు. అక్తర్ వేసే బంతులు 150 కిలో మీటర్ల వేగంతో వస్తాయని.. వాటిని ఎదుర్కోవడం ఓ సవాలేనని చెప్పాడు. ప్రస్తుతం కామేంటేటర్‌గా కూడా షోయబ్ అక్తర్ బౌలింగ్ మాదిరే ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు.