అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 :  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి  ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి సంతకం చేయటంతో ఈ చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. అత్యాచార నిరోధక బిల్లును నేరచట్ట(సవరణ) బిల్లు, 2013గా పిలుస్తున్నారు. క్రిమినల్‌లా(సవరణ) బిల్లు-2013 పేరుతో రూపొందించిన ఈ బిల్లు ప్రకారం అత్యాచార నేరాలను పునరావృతం చేసేవారికి, దారుణమైన అత్యాచారాలకు పాల్పడేవారికి జీవితకాలమంతా(చనిపోయేంతవరకు) జైలు శిక్ష, లేదా మరణశిక్ష విధించవచ్చు. ఇతర లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు 20సంవత్సరాల వరకు శిక్ష విధించే వీలుంది.