అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుకరణ

 పాన్ గల్,ఆగస్టు 10,( జనం సాక్షి)
 మండల పరిధిలోని జడ్పిహెచ్ఎస్ మహమ్మదాపూర్ పాఠశాలలో పదో తరగతిలో పాఠశాల ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 1000 రూపాయలు, 800 రూపాయలు చొప్పున నగదు బహుమానాన్ని మండల మాజీ ఎంపీపీ అన్న నారాయణ బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అన్నిటికంటే విద్యాదానం గొప్పదని అందులో భాగంగా ప్రతి సంవత్సరం మండల పరిధిలో ఉన్నత పాఠశాలకు, కళాశాలకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమానాన్ని ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీని గ్రామ సర్పంచ్ జయరాములు, సింగిల్ విండో సభ్యులు బాలయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానించడం జరిగింది. వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాలలో మొక్కలను నాటారు.