అదనపు తరగతి గదులకు భూమి పూజ
సారంగాపూర్, జులై 21 (జనంసాక్షి): మండలంలోని రంగపేట,రేచపల్లి,మంగెళ గ్రామా లలో ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదు లకు జగిత్యాల శాసన సభ్యులు ఎల్.రమణ శని వారం భూమిపూజ చేసారు.ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పనితీరు ప్రస్తుతం సక్రమంగా ఉందని,తమ పిల్లలని ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. గతంతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మంచి ఫలితాలు వస్తున్నాయని,దీనికోసం కృషిచేస్తున్న ఉపాద్యాయులను ప్రత్యేకంగా అభి నందనలు తెలిపారు.అదేవిధంగా రేచపల్లి పార Äశాలలో విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్న భోజ నాన్ని పరిశీలించారు.బీర్‌పూర్ జూనియర్ కళాశా లను ఆయన అకస్మికంగా తనిఖీచేసారు. ఈసం దర్బంగా విద్యార్థులను అడిగి తమ సమస్యలు తెలుసుకున్నారు.రేచపల్లి విద్యార్థులు తమకు ఆట స్థలం లేదని,ఆటస్థలం కోసం వినతి పత్రం సమ ర్పించారు.ఈకార్యక్రమంలో ఎంపీడీఓ సంజీవ రా వు,ఎంఈఓ మద్దెల నారాయణ,నాయకులు ముక్క వెంకటేష్,రాజెందర్‌రెడ్డి,డిల్లి రామారావు, మనోహ ర్‌రెడ్డి,అపాచి రాజు,గంగరెడ్డి,లక్ష్మణ్,ఆనంద్ తది తరులు పాల్గొన్నారు.