అదో అద్భుతం భారత్‌-చైనా ‘సరిహద్దు’ పరిష్కారం

ఆంటోని
తిరువనంతపురం, (జనంసాక్షి) :
భారత్‌-చైనా సరిహద్దు విదాదం శాంతియుతంగా పరిష్కారమవడం ఒక అద్భుతమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. శనివారం కేరళలోని ఇజిమలలో గల ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌డ్‌ శిబిరాన్ని ఆయన సందర్శించి ప్రసంగించారు. భారత రక్షణ వ్యవస్థ ఎంతో బలోపేతమైందని అన్నారు. భారత సైనిక, వైమానిక, నావికాదళ వ్యవస్థలు ఇప్పుడు ఎంతో బలీయ శక్తిగా అవతిరించాయని చెప్పారు. అందరూ భారత్‌-చైనా సరిహద్దు వివాదం యుద్ధం దిశగా వెళ్తుందని అనుకుంటున్న తరుణంలో ఇరు దేశాలు ఎంతో సంయమనంతో వ్యవహరించడంతో ఆ పరిస్థితి రాలేదని అన్నారు. సరిహద్దు వివాదం ఇంత సుహృద్భావ పూరిత వాతావరణంలో పరిష్కారం కావాడాన్ని ప్రపంచ దేశాలు అద్భుతంగా పరిగనిస్తున్నాయని చెప్పారు. రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్రసాంకేతిక పరమైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. దేశ రక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు.