అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలి…

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు….
– అదికారులు సమయ పాలన పాటించాలి…
– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ జూలై 23(జనం సాక్షి):భారీ వర్షాల వలన ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెరువుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు సిబ్బందిని రైతులను సమన్వయ పరుస్తూ అప్రమత్తం చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం నివేదికలను త్వరితగతిన అందించాలని, ఇంజనీరింగ్ అధికారులు చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందజేయాలన్నారు.  గ్రామాలలో విద్యుత్ అంతరాయాలు కలగకుండా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు ట్యాంకులను శుభ్రపరచాలని స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలన్నారు.మున్సిపాలిటీలలో అధికారులు నిరంతరం పారిశుధ్యం మెరుగుపరుస్తూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.కోవిద్ బూస్టర్ డోస్ లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామని కోవిద్ నిబంధనలుపాటించాలని    అన్నారు.దేవరుప్పుల మండలంలో అధిక వర్షపాతం  నామోదు అయింందాని,
చెరువులు సమృద్ధిగా నిండాయని, అలుగు బారుతున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ మురుగు కాలువలు పరిశుభ్ర పరచాలని నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సకాలంలో వైద్యం అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేయడం జరిగిందని ఇటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.
వైద్యాధికారులు అందుబాటులో ఉన్నారని శానిటేషన్ పనులు విస్తృతంగా చేపడుతున్నామని, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని మంత్రికి వివరించామన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కరరావు, అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డి ఆర్ డి ఎ పి డి రాంరెడ్డి, ఆర్ డి వో లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.