అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
జిల్లా ప్రతినిధి జనంసాక్షి జులై09:-
వచ్చే మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
శనివారం నాడు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పంచాయితి రాజ్, తదితర సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వచ్చే మూడు రోజుల్లో జిల్లాలో భారి వర్షాలు కురిసే అవకాశం ఉందని అందుకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు బావులు ట్యాంక్స్, పరిశీలించాలన్నారు.
రెండూ రోజులు సెలవు దినాలు కాబ్బట్టి చెరువులు, కాలువలలో పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.
వర్షాలకు రోడ్లుపై చెట్లు పడే అవకాశం ఉన్నందున ఆర్ అండ్ బి అధికారులు ఎప్పటికీ అప్పుడు సమచారం తెలుసుకొని పరిష్కరించాలని,
శిథిల అవస్థలో ఉన్న భవనాలు, కరెంట్ పోల్స్ గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాలు, పట్టణలల్లో టామ్ టామ్ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
వర్షాల కారణంగా రోడ్లు దెబ్బ తింటే అవసరమైతే ట్రాఫిక్ మళ్లించి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది, గ్రామాల్లో విఆర్ఎ, లు, పంచాయితి కార్యదర్శులు, ఎంపిఓ లు,ఏఈ లు లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈటెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్ఓ వాసు చంద్ర, పంచాయితి రాజ్, ఇరిగేషన్, విద్యుత్ సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు