“అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి”
పెన్ పహాడ్ అక్టోబర్ 17 (జనం సాక్షి) : గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ నెమ్మది బిక్షం జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య అన్నారు, సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నెమ్మది బిక్షం అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు మంత్రి సహకారంతో మండలంలోని వివిధ గ్రామాలకు బతుకమ్మ ఘాట్ లు, ఫార్మేషన్ రోడ్లు, అనంతా రం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని వారన్నారు పెన్పహాడ్ నుండి మహమ్మదాపురం వరకు, ధర్మపురం ఎక్స్ రోడ్డు నుండి గంగూలీ తండ వర కు, తంగెళ్ల గూడెం నుండి గణపవరం వరకు, మంత్రి సహకారంతో బిటి రోడ్లు నిర్మాణం కు నిధులు కేటాయించారని వారన్నారు, ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలని, అన్నారు ఈ కార్యక్రమంలో, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, తాసిల్దార్ శేషగిరిరావు, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాం రెడ్డి, నా తల జానకి రామ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, వివిధ గ్రామాల ఎంపిటిసిలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.