అధిక ఫీజులు వసూలు చేస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలి
గద్వాల నడిగడ్డ జులై 21 (జనంసాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల డయాగ్నొస్టిక్ సెంటర్లపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి,బహు జనసేన
డిమాండ్ చేస్తూ జిల్లా ఆరోగ్యశాఖ సీనియర్ అసిస్టెంట్ మహిపాల్ కు వినతి పత్రం గురువారం అందజేశారు.
బహు జనసేన జిల్లా అధ్యక్షుడు దానయ్య
మాట్లాడుతూ రక్త పరీక్ష లకు ప్రజలకు అందుబాటులో ఉండే ఫీజులు కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
గద్వాల జిల్లాలోనీ డయాగ్నొస్టిక్ సెంటర్లలో,
మలేరియా ,టైఫాయిడ్,చికెన్ గున్యా, డెంగ్యూ,వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని
గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న డయాగ్నొస్టిక్ సెంటర్లకు అనుమతి లేదని కొన్నిటికి రిజిస్ట్రేషన్ ఇంకా రెన్యువల్ చేయించుకో లేదని, ఓకే సర్టిఫికెట్ పై రెండు డయాగ్నొస్టిక్ సెంటర్లో నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రైవేట్ హాస్పిటల్ లో ముందు ఏ టెస్ట్ కు ఎంత తీసుకోవాలో బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గద్వాల మండల అధ్యక్షులు నరేష్,రాజు ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.