అనాథ కుటుంబానికి అండగా సురక్ష పౌండేషన్ సభ్యులు
– నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ
– కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబీకులు
మక్తల్, జూలై 17 (జనం సాక్షి)
మక్తల్ పట్టణం రంగుల వీధికి చెందిన రంగుల శ్యామల అనే నిరుపేద కుటుంబీకులకు ఆదివారం మక్తల్ పట్టణానికి చెందిన సురక్ష ఫౌండేషన్ సంస్థ సభ్యులు ఉదారతతో ఆ కుటుంబానికి నెల రోజులకు సరిపడే నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురక్ష పౌండేషన్ సంస్థ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ కుటుంబానికి చెందిన పెద్ద దిక్కు అయిన రంగుల శ్యామల భర్త రంగుల ఆంజనేయులు మేస్త్రి అనారోగ్యంతో మృత్యువు బారిన పడడంతో ఆ కుటుంబం అల్లాడి పోయింది. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయినా శ్యామల ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలి అన్న బెంగతో ఉండిపోయింది. పూటగడవని శ్యామలమ్మ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మక్తల్ సురక్ష పౌండేషన్ సభ్యులు వెంటనే ఆ కుటుంబాన్ని ఆశ్రయించి వారికి నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేస్తూ తమ ఉడతా భక్తిని చాటుకున్నారు. సురక్ష ఫౌండేషన్ సభ్యులు తమను ఆదుకోవడం తోటి రంగుల శ్యామల తన ఇద్దరు పిల్లలు సురక్ష ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నిరుపేద కుటుంబీకులు ఎవరైనా ఉంటే తమ ఫౌండేషన్ కు తెలియజేసినట్లు అయితే తమ వంతు ఉడతాభక్తిగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తామని అధ్యక్షులు రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సభ్యులు మల్లినాథ్, వాహిద్, బొమ్మన్పాడు రవీందర్, డాక్టర్ ఆశప్ప, డాక్టర్ సిద్ధ రామేశ్వర, రాఘవేంద్ర, శివరాజ్, శిశు మందిర్ హెచ్ఎం కురుమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు