అనాధ చిన్నారులకు అండగా నిలిచిన జిల్లా రజక సంఘం
తండ్రి కరోన తో పది రోజుల క్రితం తల్లి హార్ట్ ఎటాక్ తో మృతి చెందగా వారి కొడుకు కూతురు అయిన చిన్నారులు అనాధాలు కావడం తో చలించిన రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేశ్,బోయినపల్లి మండల రజక సంఘం అధ్యక్షులు ర్యాగాళ్ల అంజయ్య ,నాయకులు వారిని ఓదార్చి ఆర్థిక తో పాటు వారి చదువులకు సహకరిస్తాం .
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్ర పల్లి కి చెందిన ఏడెల్లి మల్లెశం కరోన తో ఏడాది క్రితం మృతి చెందగా పది రోజుల క్రితం ఏడెల్లి సత్య గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు అనదలైన చిన్నారులను ఓదార్చి వారికి 46 వేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యవసర జిల్లా సరుకులు అందజేసారు ఈ సందర్భంగా దుబ్బాక రమేష్ మాట్లాడుతూ. వారి చదువు తో పాటు ఎప్పటికి అండగా ఉంటామని వారికి చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్,చొప్పదండి నియోజక వర్గ ఇంచార్జ్ అకునూరి మల్లయ్య, గంగాధర మండల అధ్యక్షులు ర్యాగాళ్ల రమేష్,మాల్యాల అధ్యక్షులు లక్ష్మణ్,ఇల్లంతకుంట అధ్యక్షులు తెలంగాణ శ్రీను,కరీంనగర్ ఉపాధ్యక్షులు మునిగంటి అనిల్,పెగడపల్లి అధ్యక్షులు రాజేశం,నాయకులు రాజులేశం,,లక్ష్మణ్ రాజులేశం, రవి జరిగింది. దుండ్రా పల్లిటిల్ ఫ్లవర్ యూత్ సభ్యులు కూడా 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.