అనువాదాలు ఎందుకు?
సృజనాత్మకత వేరు. అనువాదాలు చేయడం వేరు. ఒకే ఒక భావన, ఓ బోవోద్వేగం కవితో కవిత్వం రాయిస్తుంది. ఓ సంఘటన ఓ అనుభవం రచయితతో ఓ కథో, నవలో రాయిస్తుంది. కథలూ, కవిత్వం, నవల రాయడానికి ఇతరులతో పని తేదు. వాళ్లకు కలగిన భావనలు, అనుభవాలూ ఆలోచనలు సరిపోతాయి. అనువాదకుడికి ఇవి సరిపోవు.అనువాదకుడు ఆ కవి, ఆ రచయితలోకి పరకాయ ప్రవేశం చేసి అతని ఆత్మను పట్టుకోవాలి. పట్టుకోవడమే కాదు దాన్ని తాను ఏ భాషలోకైతే అనువాదం చేస్తున్నాడో ఆ పాఠకులకి అందే విధంగా అనువదించాలి. ఇది అంత సులువైన విషయం కాదు. అట్లా అని అనువాదం చేయలేరని కాదు. ఆ రచనలు సృజించిన రచయితలు చేసే పని కన్నా ఇది కష్టమైన పని. సాహిత్యంలో సృజనాత్మక రచయితలకు ఉన్న గౌరవం అనువాదకులకి లభించడం లేదు. ఇది దురదృష్టకరమైన విషయం. ఆ రచయితని రచనని ఆ రచయితకి ఎక్కువగా ప్రవేశంలోని మరో భాషలోకి, మరో ప్రపంచంలోకి ఆ రచయిత తీసుకొని వెళ్తున్నాడు. ఆ విషయాన్ని అందరూ గర్తుకు తెచ్చుకుంటే వాళ్లు అనువాదకులకి అత్యదిక గౌరవాన్ని ఇవ్వడం మొదలు పెడతారు.అనువాదం చేయడమనేది దుస్సాధ్యం అన్న వ్యక్తులూ వున్నారు. ముసుగులో ఉన్న పెళ్లి కూతురుని ముద్దాడటం లాంటిది అనువాదం అని చెప్పిన వాళ్లు ఉన్నారు. ఈ రెండు అభిప్రాయాలని పూర్తిగా త్రోసిపుచ్చలేం. కథల్లో నవలలో ఆ రచయిత వాడిన ఆ భాషలోని నుడికారాలూ జాతీయా లూ అనువాదం చేసే భాషలో వుండకపోవచ్చు. ఆ రచనలో వాడిన పూర్వ కథలు, సూచిత విషయాలు అనువాదం చేసే భాషలో వుండక పోవచ్చు. సృజనాత్మకత రచయిత ఆ కథలో చెప్పిన సంస్కృతి, ప్రత్యేకమైన అభివ్యక్తి వేరుగా ఉండవచ్చు. పదాల చుట్టు ఉన్నా సహజార్థాలు కొన్ని మూల రచనలో ఎక్కువగా ఉండవచ్చు. ఇవన్ని అనువాదకుడికి ఎదురయ్యే అవరోదాలు. వీటిని అధిగమించి అనువాదం చేయాల్సి ఉంటుంది. మూల రచనలో ఉన్న స్ఫూర్తిని పూర్తిగా అనువాద రచనలు ప్రతిబింబించకపోవచ్చు. కాని వాటి ఆత్మ చెడిపోకుండా అనువాదకుడు అనువాదం చేయాల్సి ఉంటుంది.
అనువాద రచన మూల రచనకి రాజభక్తి కలిగి ఉండాలి. అనువాద భాషలో ఉన్న దేశీయ పదాలని వాడి అను వాదానికి దేశీయ స్ఫూర్తిని కలిగించాలి. ఇది అనువాదంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు. అనువాదం అనేది స్వతంత్రమైనది. అనువాద రచణకి అన్వేషించిన భాషలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అనువాద రచనలు స్వతంత్రంగా విలసిల్లాలి కాని అవి మూల రచనకి అనుబంధంగా ఉండాలి. మూలరచన స్ఫూర్తిని చెడగొట్టకూడదు. కొన్ని ఏమాత్రం తక్కువ చేయకూడదు. అట్లాని ఎక్కువ చేయకూడదు. సాహిత్యాన్ని అనువాదం చేయడం వేరు. సాహిత్యేతర విషయాలని అనువాదం చేయడం వేరు. ఈ రెండింటి విషయంలో కొంత సామీప్యం ఉన్నప్పటికి రెండు విభిన్న విషయాలు. సాహిత్యం అనువాదం చేసేటప్పుడు అనువాదకుడిగా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. కాని సాహిత్యేతర విషయాలని అనువాదం చేసే అనువాదకుడికి ఆ స్వేచ్ఛ ఉండదు. ఈ రెండు పనులలో కూడ విభిన్నమైన వ్యక్తిని నేను. గత 20 సంవత్సరాలుగా శాసనాలను, చట్టపరమైన వ్యాసాలని తెలుగు లో రాస్తున్నాను. వాటి మూల రచనలు ఇంగ్లీష్‌లో ఉంటాయి. చట్ట సంబంధమైన వ్యాసాలు రాయడం వేరు. శాసనాలని తెలుగులో రాయడం వేరు. శాసనాలని తెలుగులో రాయడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ఉన్న శాసనాలని చదు వుకొని అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంటుంది.శాసనాల్లోని చాలా నిబంధనలు వ్యతిరేకార్థంలో ఉంటాయి. చాలా నిబంధనలు సుదీర్ఘంగా ఉంటాయి. వాటిని తెలుగులో తర్జుమా చేయడం అంత సులువు కాదు. సాహిత్యంతో సంబంధం ఉండి, లా చదువుకున్నా వ్యక్తులు అనువాదం చేసిన రచనలు ఎక్కువగా ప్రాచుర్యం పొందు తున్నాయి. నేను అనువాదం చేసిిన పుస్త్తకాలు ఐదారు ముద్రా ణ లు పొందడ మే అం దుకు నిదర్శనం. తెలు గు అనువాదం జటిలంగా , ప్రజలు మా ట్లాడు కునే భాషలో లేకుంటే రచనలు ఎవరన్నా కొన్నా వాటిని చదవలేరు. తెలుగు చదివేబ దులు గా ఇంగ్లిష్ చదవ డమే మంచి దని భావిస్తారు. వాటిని దృష్టిలో పెట్టురకొని అనువాదం చేయాల్సి ఉం టుంది.
శాసనాలు తయారు చేసేటప్పుడు సుదీ ర్ఘ వ్యాక్యాలని ఉపయోరగిస్తారు. దాన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఇంగ్లిష్‌లో శాసనాలను తయారు చేసేటప్పుడు సులభమైన భాష వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతే కాదు చిన్న చిన్న వాక్యాలు ఉండాలి. నిబంధనలు సుదీర్ఘంగా ఉండకూడదు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే మన భారత దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తున్న చట్టాలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. అవి సామాన్యులకి అర్థం కావు. దేశంలోని అన్ని భాషల్లోకి ఆ చట్టాలు అనువాదం కావల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇంగ్లిష్ రచన సులభ శైలిలో ఉంటూ ఆయా భాషల్లో అవి సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. చట్టాలు ప్రజలకి చేరువలో ఉంటే వాళ్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక, రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్రాల్లో తయారు చేసే చట్టాలు ఆయా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ భాషల్లో తయారు చేయలి. వాటిని ఇంగ్లిష్‌లోకి అనువదించాలి. ఎందుకంటే ఇంగ్లిష్ అనివార్యమై పొయింది. సుప్రీం కోర్టులలోకి వెళ్లేటప్పుడు ఇంగ్లిష్ అవసరమైపోయింది. తెలుగులో శాసనాల్ని తయారు చేసినప్పుడు వున్న సౌలభ్యం, ఇంగ్లిష్ నుంచి అనువదించినప్పుడు ఉండదు. తెలుగులో శాసనాల్ని తయారు చేసినప్పుడు అవి ప్రజలకు త్వరగా చేరువవుతాయి. ఈ సూక్ష్మాన్ని పాలకులు త్వరగా గుర్తిస్తే ప్రజలకి మేలు చేసిన వాళ్లు అవుతారు. శాసనాలు ముసాయిదా చేసేపుడే చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. సులభమైన భాష స్పష్టమైన అర్థాలు ఉపమోగించినపుడు నిబంధలని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. అట్లా కఠినమైన భాష, స్పష్టత లేని పదాలు ఉపయోగించినపుడు ఇంగ్లిషు భాగా తెలిసిన వాళ్లకి న్యాయ వాదులకు న్యాయమూర్తులకే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేసేప్పుడు ఇంకా కష్టంగా ఉంటంది. అనువాద ప్రక్రియలో ఎదురయ్యే మరో సమస్య తెలుగు లో సరైన పదాలు లేక పోవడం, అవసరమైనన్ని పదకోశాలు లేక పోవడం ఉన్న పదకోశాల్లో గ్రాంధిóకత ఎక్కువగా ఉండడం. అను వాదకలు ఎవరైన గుర్తుంచుకోవాల్సిన విషయం పదాన్ని వివరించడం కాదు. కొత్త పదాల సృష్టి జరగాలి. ఈ పదాల సృష్టి కూడ కృతకంగా ఉండకూడదు. ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలు ఉపయోగిచే విధంగా ఉండాలి. పదాలను వివరిస్తే ఆ అను వాదం అందమే పోతుంది. ఆ అనువాదం చదవడమే కష్ట సాధ్యమైపోతుంది. ఇంగ్లిషులోకి రోజూ కొన్ని వందల కొత్త పదాలు వస్తున్నాయి. వాటికి సరైన కొత్త పదాల సృష్టి తెలుగులో జరగాలి. అది నిరంతరంగా జరగాలి. అప్పుడే భాష పరిపుష్టం అవుతుంది. భారత దేశ పార్లమెంట్ ఇంగ్లిషులోనే చట్టాలను తయారు చేస్తుంది. ఆ విషయంలో పేచీ లేదు. ఆ చట్టం ఇంగ్లిషు చట్టంతో పాటు ఏకకాలంలో అన్ని భాషల్లోకి అనువాదం అయ్యే విధంగా చూడాలి. ఆ అనువాదానికి అయ్యే ఖర్చులకి భడ్జెట్ కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం కేటాయించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే ఆ పనిని చేపట్టాలి. ఈ పనిని కేంద్ర ప్రభుత్వమే చేయడం సరైంది. ఒక కొత్త చట్టం వల్ల కోర్టులు మీద పడే పనిభారాన్ని అంచనా వ్యవస్థ ఎంత అవసరమో ఆ కొత్త చట్టం దేశంలోని అన్ని భాషల్లోకి అనువాదం అయ్యేలా చూడాలి. అది కూడ మంచి అనువాదకులు చేయాలి. ఆ విధంగా చేయనప్పుడు అది కృతకంగా ఉంటుంది.
ఏ భాష అయినా పరిపుష్టం కావాలన్నా దినదినాభివృద్ధి చెందాలన్నా కొత్త పదాల సృష్టి జరగాలి. అది ఒక్క సారస్వతంతోనే రాదు. సాంకేతిక గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు ఆయా ప్రాంతీయ భాషల్లోకి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే ఆ భాష పరిపుష్టం అవుతుంది. కొత్త పదాల సృష్టి జరుగుతుంది. పదాల సృష్టితో పాటు పదకోశాలని ఆధునీకరించే ప్రక్రియ నిరంతం జరగాలి.ఇక సాహిత్యం విషయానికొస్తే అనువాదాలు లేకపోతే ఆ రచయిత పరిధి, ఆ భాష సారస్వత పరిధి చిన్నదైపోయింది. అనువాదాలు అత్యంత అవసరం. ఇక్కడ కూడ గమనించాల్సిన విషయం అను వాదకుడికి రెండు భాషల మీద మంచి పట్టు ఉండాలి. పట్టు లేకపోతే ఆ అనువాదం పటిష్టంగా రాదు. విశేషణాలని అను వాదకుడు జాగ్రత్తగా గమనించాలి. మూల రచనలో వాడిన విశేషణానికి సరైన అనువాదాన్ని ఎంపిక చేసుకుని అనువాద రచనలో ఉపయోగించాలి. అదే విధంగా ఆ రచనలో వున్న నేప థ్యాన్ని అర్థం చేసుకోవాలి. ‘ఊసిళ్లు’ అనే కీటకం అన్ని ప్రాంతాల్లో ఉండక పోవచ్చు. దాని జీవన పరిధి అర్థంలో ఈ పదాన్ని రచయిత వాడవచ్చు. ఈ పదాన్ని ఇంగ్లిషులో ఇన్‌సెక్ట్ అని వాడితే రచయత చెప్పదలుచుకున్న భావన అందక పోవచ్చు. భారీకాయం వేరు భయం కొల్పే కాయం వేరు. ఈ రెండిటిని ఒకేలా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.ఇంతకు ముందే చెప్పినట్లు, అనవాదం చేసే వ్యక్తికి రెండు భాషల మీద కూడ పట్టు ఉండాలి. అవి మూల భాష అనువాదం చేసే భాష ఇవి రెండే సరిపొవు. సాహిత్యం అనువాదం చేసే వాడికి సాహిత్యాభిలాష, కవిత్వం అనువాదం చేసే వాడికి కవిత్వంలోని తత్వం బోధపడాలి. అప్పుడే అనువాదాల్లో ప్రాణం ఉంటుంది. మాండలికాల్లో ఉన్న రచనల్ని మాండలిక అభివ్యక్తీకరణ ఎక్కువగా ఉన్న రచనల్ని అనువదించడం కష్టంతో కూడుకున్న పని. కానీ అనువాదాలు అవసరం. ప్రపంచంలోని అన్ని సాహిత్యల్లోని మౌలికమైన అంశం ఒక్కటే అదే మానవత్వం. అది అందరికి పంచే వాహకుడు అనువాదకుడు.శాస్త్ర పుస్తకాలు, శాసన పుస్తకాలకి సంబంధించి అనువాదాలు చేసే వ్యక్తులకి ఆ సంబంధిత క్షేత్రంలో ప్రవేశం ఉండాలి. సులభ శైలిలో వ్యవహార భాషలో చెప్పే నేర్పు వుండాలి. ఇవి ఉన్నపుడే అవి ప్రజలను ఆకర్షిస్తాయి.ఏమైన అను వాదాలు అత్యంత అవసరం ఈ కథల్ని కవిత్వాలని, శాసనాలని అనుకరించే పనిలో ఉన్నాను కాబట్టి ఈ ముచ్చట్ల మీతో.